Bandi Bhagirath Jail Return : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బెయిల్‌పై విడుదల ఆయన్ను పోలీసులు తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్థరాత్రి వేళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. గతంలో నమోదైన ఈ తీవ్రమైన నేరారోపణల కేసులో అరెస్టయిన భగీరథ్‌కు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టు గతంలోనే రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడు చర్లపల్లి జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.పరీక్షల నిమిత్తం కోర్టు మంజూరు చేసిన బెయిల్..అయితే తాను ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్నానని, తన విద్యా సంవత్సరం పాడవకుండా పరీక్షలు రాసేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరుతూ బండి భగీరథ్ తరఫు న్యాయవాదులు జిల్లా కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి భవిష్యత్తును, చదువును దృష్టిలో ఉంచుకున్న న్యాయస్థానం మానవతా దృక్పథంతో స్పందించింది. ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు వీలుగా ఈ నెల 20వ తేదీన అతడికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఈ ఊరటతో జైలు నుంచి బయటకు వచ్చిన భగీరథ్ తన పరీక్షలకు హాజరయ్యాడు.నిబంధనల ప్రకారం ముగిసిన గడువు.. అర్థరాత్రి మళ్లీ అరెస్ట్కోర్టు విధించిన కఠినమైన నిబంధనల ప్రకారం గురువారంతో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కాల పరిమితి ముగిసింది. బెయిల్ గడువు ముగిసిన తక్షణమే అప్రమత్తమైన మేడ్చల్ పోలీసులు గురువారం రాత్రి అతడిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడిని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం.. అర్థరాత్రి దాటాకా కట్టదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించి జైలు
Actor ProfilePolitician
మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగరీథ్.. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తరలింపు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Jul 2026
మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగరీథ్.. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తరలింపు