
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ అస్ట్రేలియా బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్ తేడాతో గెలుపొందింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఆధిపత్యాన్ని 1-2కు తగ్గించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇదివరకే సిరీస్‌ను చేజార్చుకున్న ఆసీస్.. నేటి మ్యాచ్‌లోనూ మరో ఘోర పరాభవాన్ని తృటిలో తప్పించుకుంది. 275 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కన్నోల్లీ (149) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి, మరో ఘోర ఓటమికి చేరువైంది. నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్ మూడో బంతికి ఆడమ్ జంపా (4 నాటౌట్) బౌండరీ సాధించి, ఆసీస్‌ను మరో ఘోర పరాభం నుంచి తప్పించడంతో సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యే అవమానం నుంచి కూడా గట్టెక్కించాడు. చివర్లో జంపాకు మెరిడిత్ (2 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా ఆసీస్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీ అనంతరం కన్నోల్లీ గెలుపు వాకిట ఔటై ఆసీస్ శిబిరంలో ఉత్కంఠ రేపాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ .. తౌహిద్ హృదోయ్ (83), లిటన్ దాస్ (58 నాటౌట్), మొసద్దెక్ హొసేన్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బార్ట్‌లెట్, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కన్నోల్లీ ఒంటరిపోరాటం చేశాడు. అతడికి లబూషేన్ (29), గ్రీన్ (27), పీక్ (27) కాసేపు అండగా నిలబడ్డారు. గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో