మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు
Actor ProfileActor

మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema20 Aug 2026
మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా “రంభ ఊర్వశి మేనక” సినిమా మొదటి లుక్ విడుదల చేశారు. పనిలో పనిగా విడుదల తేదీ కూడా ప్రకటించారు. సో, థియేటర్లలోకి రానున్న నరేష్ తదుపరి చిత్రం ఇదే. ఐతే, నరేష్ నటించిన ఆల్కహాల్ (Alcohol) అనే సినిమా గురించి ఏమి అప్డేట్ లేదా? ఆ ప్రశ్న అడగకముందు నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. అల్లరి నరేష్ కి హ్యాపీ బర్త్ డే చెప్తూ ఒక పోస్టర్ వచ్చింది. అందులో విడుదల ఎప్పుడు అనే క్లారిటీ లేదు. నిజానికి ఈ సినిమాని జనవరి 1, 2026న విడుదల చేస్తామని ఏడాది క్రితం నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించింది. కానీ ఆరు నెలల తర్వాత కూడా ఈ సినిమా కూడా విడుదల కాలేదు. జనవరి 1, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు మధ్యలో ఒక్కసారి కూడా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు. దాంతో హీరో సహా అందరూ మర్చిపోయారు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేసి మళ్ళీ గుర్తు చేశారు. నరేష్ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ లేకపోవడం, OTT సమస్యల కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదా? మరేదైనా కారణం ఉందా?