మరీచిక' అమెజాన్ ప్రైమ్ మూవీ రివ్యూ
Actor ProfileCelebrity

మరీచిక' అమెజాన్ ప్రైమ్ మూవీ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరీచిక' అమెజాన్ ప్రైమ్ మూవీ రివ్యూ
AP7AM30 Jun 2026
మరీచిక' అమెజాన్ ప్రైమ్ మూవీ రివ్యూ

తెలుగు తెరపై కథానాయికలుగా అనుపమా పరమేశ్వరన్ - రెజీనా ఇద్దరూ తమ ప్రతిభను నిరూపించుకున్నవారే. ఇక 'బేబీ' సినిమాతో విరాజ్ అశ్విన్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాంటి ఈ ముగ్గురూ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'మరీచిక'. సతీశ్ కాశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 29వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.హైదరాబాద్ లోని ఒక డిగ్రీ కాలేజ్ లో వెంకటలక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) చదువుతూ ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే సంజయ్ ( విరాజ్ అశ్విన్) ఒక కాఫీ షాప్ ను నిర్వహిస్తుంటాడు. తొలిచూపులోనే సంజూపై మనసు పారేసుకున్న వెంకటలక్ష్మీ, అతనికి చేరువ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే అమెరికా నుంచి వచ్చిన 'మరీచిక' (రెజీనా)తో వెంకటలక్ష్మీకి పరిచయమవుతుంది. చాలా తక్కువ రోజులలోనే వాళ్లిద్దరి మధ్య ఎక్కువ సాన్నిహిత్యం పెరిగిపోతుంది.తల్లిదండ్రులను కోల్పోయిన 'మరీచిక', హైదరాబాద్ లోని తన ఆస్తులను అమ్మేసుకుని తిరిగి అమెరికా వెళ్లే ఆలోచనలో ఉందని వెంకటలక్ష్మి తెలుసుకుంటుంది. వెంకటలక్ష్మితో పాటు తన కాఫీ షాప్ కి వచ్చిన మరీచికతో సంజూ మాటలు కలుపుతాడు. వాళ్లిద్దరి మధ్య పరిచయం చాలా ఫాస్టుగా ప్రేమగా మారిపోతుంది. అయితే సంజూ తనకి దక్కకుండా పోతుండటాన్ని వెంకటలక్ష్మీ భరించలేకపోతుంది. వాళ్లిద్దరూ గుళ్లో చేసుకున్న పెళ్లికి ఆమె ఒక ప్రధానమైన సాక్షిగా ఉండిపోతుంది.ఒకానొక సమయంలో తనకి మరీచిక చెప్పిన మాటలన్నీ అసత్యాలని వెంకటలక్ష్మి తెలుసుకుంటుంది. ఆ సమాచారాన్ని రహస్యంగా సంజూకి చేరవేస్తుంది. అయితే ఆ విషయాన్ని గ్రహించిన మరీచిక, హనీమూన్ పేరుతో సంజూని బయల్దేరదీస్తుంది. పొలిమేరలలోకి వెళ్లగానే సంజూపై ఎటాక్ చేస్తుంది. సంజూ స్నేహితులను తన వైపుకు తిప్పుకుని, వాళ్లతో కలిసి అతణ్ణి హత్య చేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన వెంకటలక్ష్మీ ఏం చేస్తుంది? పర్యవసానంగా చోటుచేసుకునే సంఘటనలు ఎలాంటివి? అనేది