మరో కేసులో యూట్యూబర్ రావణ్ అరెస్ట్
Actor ProfilePolitician

మరో కేసులో యూట్యూబర్ రావణ్ అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరో కేసులో యూట్యూబర్ రావణ్ అరెస్ట్
Eenadu6 Sept 2026
మరో కేసులో యూట్యూబర్ రావణ్ అరెస్ట్

కాకినాడలో ఉద్రిక్తత ఆసుపత్రికి, కోర్టుకు తరలిస్తుండగా జనసేన కార్యకర్తల అడ్డగింత పోలీసు వాహనంపై కోడిగుడ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ అరెస్టు, అనంతరం కోర్టుకు తరలించే సందర్భంలో కాకినాడలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పిఠాపురం పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి, జడ్జి ముందు హాజరుపరచగా అర్ధరాత్రి బెయిలు మంజూరు చేశారు. ఆ వెంటనే మరో కేసులో పోలీసులు.. పిఠాపురం పట్టణ పోలీసుస్టేషన్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక రావణ్‌ను అరెస్ట్‌ చేశారు. కాకినాడ గ్రామీణం పరిధిలోని సర్పవరం ఠాణాకు తరలించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాలలో పిల్లల మధ్య గొడవను కులాల మధ్య ఘర్షణగా చిత్రీకరించేలా మాట్లాడటంపై సర్పవరం పోలీసులు 2025లో రావణ్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అతడిని గురువారం మధ్యాహ్నం వరకు విచారించారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని, అతడిని రక్షిస్తున్న పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో పోలీసు వాహనం ఎక్కే ముందు జనసేన కార్యకర్తలను చూసి నిందితుడు తన పిడికిలి బిగించి రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించాడు. వాహనం పోలీసుస్టేషన్‌ బయటకు రాగానే జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వారికి తోపులాట జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు జీపు ముందు భాగంపై కోడిగుడ్లు విసిరారు. సర్పవరం పోలీసుస్టేషన్‌ వద్ద జనసేన కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట నిందితుడిని పోలీసులు జీజీహెచ్‌కు కాకుండా పోలీసు రిజర్వ్‌లైన్‌లోని వైద్యాధికారి వద్ద పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టుకు తరలిస్తారని తెలుసుకుని జిల్లా పరిషత్‌ కూడలి వద్దకు జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు మరో మార్గంలో నిందితుడిని తీసుకెళ్తుండగా కార్యకర్తలు ఆ వైపు చేరుకుని, కోర్టు వద్దకు రాగానే