
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల కోసం 2018లో క్రెడ్‌ను స్థాపించారు కునాల్ షా. దేశంలో జరుగుతున్న క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్లలో 40 శాతానికి పైగా క్రెడ్ వేదికగానే జరుగుతున్నాయి. క్రెడ్‌కు సుమారు 1.7 కోట్ల మంది నెలవారీ యూజర్లుగా ఉన్నారు. గడిచిన 8 ఏళ్లలో కంపెనీని ఈ స్థాయికి తెచ్చిన కునాల్ షా.. ఇకపై వాట్సప్‌ను ముందుండి నడపించనున్నారని మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. కునాల్ క్రెడ్‌ను భారత దేశంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారు. ఇకపై ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నడపడంలో ఆయనకున్న నిర్మాణ దృక్పథం, దృష్టికోణం ఎంతగానో ఉపయోగపడతాయి. కోట్లాది మంది వాట్సాప్ యూజర్లు, లక్షలాది మంది వ్యాపారులకు అత్యుత్తమ సేవలు అందించే ప్రక్రియలో కునాల్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని జుకర్ బర్గ్ తెలిపారు. వాట్సప్‌ను లీడ్ చేసే బాధ్యతలు దక్కిన నేపథ్యంలో కునాల్ షా ఎక్స్ వేదికగా క్రెడ్ టీమ్‌నుద్దేశించి పోస్ట్ పెట్టారు. మీ సామర్థ్యానికి పది రెట్లు అధిక స్థాయి పనితీరు కనబరచాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. క్రెడ్ సీఈవోగా కునాల్ షా వైదొలిగిన నేపథ్యంలో కంపెనీ స్ట్రాటజీ, ఫైనాన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న మిథున్ సంపత్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరించనున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్