
West Bengal Politics : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ ట్విస్టులో చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీనికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తృణమూల్ పార్టీకి చెందిన 20మంది ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా.. జాతీయ రాజకీయాల్లో ఎన్‌సీపీఐ హాట్ టాఫిక్ గా మారింది. ఈ క్రమంలో అసలు ఎన్‌సీపీఐ ఎవరిది? ఏ రాష్ట్రంలో ఆ పార్టీ రిజిస్ట్రర్ అయింది..? అనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. త్రిపురకు చెందిన పెద్దగా ప్రాచుర్యం లేని ప్రాంతీయ పార్టీ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. తృణమూల్ కాంగ్రెస్‌లోని అసమ్మతి ఎంపీలు ఈ పార్టీలో విలీనం అయినట్లు ప్రకటించడం. ఎన్‌సీపీఐ బెంగాల్‌తో ఉన్న సంబంధం కేవలం హౌరా జిల్లాలోని సంక్రైల్ చిరునామా మాత్రమే. 2023లో స్థాపించబడిన ఈ పార్టీ ప్రధానంగా త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో పరిమిత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పార్టీ ఎన్నికల గుర్తు “ఏడు కిరణాలతో కూడిన పెన్ నిబ్” (కలం మొన). త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపినా ఒక్కరూ గెలవలేదు. అక్కడ పార్టీ వ్యవహారాలను శాంతను సాహా నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం చూస్తే.. ఎన్సీపీఐ 2023 జనవరి 20న త్రిపురలో రిజిస్ట్రర్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా నమోదైంది. అక్కడి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన శాంతను డే తెలిపారు. అయితే, పార్టీ ప్రధాన కేంద్రం మాత్రం పశ్చిమ బెంగాల్ ఉంది. త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీఐ తరపున ఏడు స్థానాల్లో అభ్యర్థులు