మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం
Actor ProfilePolitician

మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం
AP7AM20 Jun 2026
మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం

మన మహోన్నత సంస్కృతి, విలువల వల్లే భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ వారసత్వాన్ని కాపాడుకుని, భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండవల్లి గుహల వద్ద యోగా గురు బాబా రాందేవ్‌ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. యోగాంధ్ర లోగోతో ఉన్న చొక్కా ధరించి, రాందేవ్‌ ప్రదర్శించిన పలు యోగాసనాలను ఆసక్తిగా తిలకించారు.ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా.. చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం వంటి కఠినమైన ఆసనాలను ప్రదర్శించి, వాటి ప్రాముఖ్యతను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, "బాబా రాందేవ్‌తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన యోగాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. టెక్నాలజీ వ్యసనంగా మారకుండా ఉండాలంటే, దానికి యోగా, ఆధ్యాత్మికత వంటివి జోడించాలి. యోగాతో శరీరం, మెదడు అనుసంధానమవుతాయి," అని అన్నారు. యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు రాందేవ్‌కు దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే 6-7 శతాబ్దాల నాటి చారిత్రక ఉండవల్లి గుహల వద్ద ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని బాబా రాందేవ్‌ను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, నేడు 190 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని గుర్తుచేశారు. ఆధ్యాత్మికతతో కూడిన వికసిత్ భారత్ సాధనలో ప్రధానికి అండగా నిలుస్తామని చెప్పారు.రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం కోసం 'సంజీవని'