మన సంస్కృతి ప్రతిరూపంలా టిటిఎ మహాసభల వేడుకలు
Actor ProfilePolitician

మన సంస్కృతి ప్రతిరూపంలా టిటిఎ మహాసభల వేడుకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మన సంస్కృతి ప్రతిరూపంలా టిటిఎ మహాసభల వేడుకలు - తెలుగు టైమ్స్ తో నవీన్ రెడ్డి మల్లిపెద్ది
Telugu Times26 Aug 2026
మన సంస్కృతి ప్రతిరూపంలా టిటిఎ మహాసభల వేడుకలు - తెలుగు టైమ్స్ తో నవీన్ రెడ్డి మల్లిపెద్ది

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) మెగా కన్వెన్షన్ 2026 ను అమెరికాలోని నార్త్ కరోలినా, ఛార్లెట్ నగరంలో జూలై 17 నుండి 19 వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి, వ్యాపారం, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రతిష్టాత్మక మహాసభలకు ఇండియా, అమెరికా నుంచి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. మరోవైపు ‘టి.టి.ఎ మెగా కన్వెన్షన్ 2026’ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మహాసభల ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని తెలుగు టైమ్స్‌తో నవీన్ రెడ్డి మల్లిపెద్ది మాట్లాడుతూ, పలు విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాలను ఇక్కడ పాఠకులకు అందిస్తున్నాము. ఛార్లెట్ కన్వెన్షన్ గురించి... ముందుగా నాకు ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించిన టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డిగారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రోత్సహిస్తూ సూచనలు అందిస్తున్న అడ్వయిజరీ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. వాళ్ళు ఇచ్చే సూచనలతో ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ టిటిఎ మహాసభలకు ఈసారి ఛార్లెట్ ను ఎంపిక చేయడం వెనుక అమెరికాలో ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతంగా ఇది ఉంటుందని భావించి ఎంపిక చేశాము. దాంతోపాటు ఛార్లెట్ కన్వెన్షన్ సెంటర్ చాలా కన్వీనియంట్‌గా ఉన్న లొకేషన్. అన్నీ ప్రాంతాల వారు సులభంగా ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలవుతుంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాము. దానికితోడు మహాసభల వెన్యూ కూడా ఏర్ పోర్ట్ ప్రాంతానికి దగ్గరగానే ఉంది. ీVAటల్స్ కూడా ప్రక్కనే ఉన్నాయి. అక్కడే కావాల్సినవారికి గదులను బుక్ చేస్తున్నాము. దానికితోడు నేను ఇక్కడే దశాబ్దకాలంపైగా నివసిస్తున్నందున ఈ ప్రాంతంలోని ప్రముఖులు, ఇతరులతో ఉన్న పరిచయం కారణంగా మహాసభలను ఇక్కడే నిర్వహిస్తే ఏర్పాట్లు చేయడానికి సులువుగా ఉంటుందని భావించి ఎంపిక చేయడం జరిగింది. ముఖ్య కార్యక్రమాల వివరాలు మహాసభలకు వచ్చేవారికోసం