మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా
Actor ProfilePolitician

మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా
Zee Telugu4 Aug 2026
మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Amaravati: 'అమరావతి చట్టం కూడా అయిపోయాక మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే ఎవరికీ అర్థం కాదు. అందరూ ఛీ కొడుతున్నారు. బాధ్యత లేని రాజకీయ పార్టీ ప్రజలను, వారి నిర్ణయాన్ని అపహాస్యం చేస్తోంది' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే వెంటనే స్పందించి ఆ గేటు బిగించి కొత్తగా 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశామని.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. గంగా- కావేరి నదులతో పాటు గోదావరి- నల్లమల సాగర్ లింక్‌తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కాలర్ ఎగరేసి చెప్పేలా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష చేసిన అనంతరం గిద్దలూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 'అమరావతిని హరిత నగరంగా, నివాస యోగ్య ప్రాంతంగా నిర్మిస్తున్నాం. మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గొడ్డలి పార్టీ ముందు అమరావతిని అంగీకరించి ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు తాత్సారం చేసిన గొడ్డలి పార్టీ అభివృద్ధిని ఆమడదూరం పెట్టిందని గుర్తుచేశారు. గొడ్డలి పార్టీ నాయకులు మోసాలు చేయటంలో దిట్టలు అని విమర్శించారు. రాష్ట్రాలకు అదే శ్రీరామ రక్ష 'గోదావరి నుంచి కావేరి నది వరకూ నీటిని తీసుకెళ్తాం. నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ కడుపు ఉబ్బరం అవసరం లేదు' అని ప్రతిపక్షాలకు చంద్రబాబు స్పష్టం