మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్? వాటి రిజల్యూషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే
Actor ProfilePolitician

మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్? వాటి రిజల్యూషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్? వాటి రిజల్యూషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే
Zee Telugu17 Jun 2026
మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్? వాటి రిజల్యూషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Technology Science: మనం కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు, మొదటగా చూసేది దాని కెమెరానే. అది ఎన్ని పిక్సెల్స్ ఉందో తెలుసుకుంటాం. 8 మెగాపిక్సెల్స్.. 200 మెగాపిక్సెల్స్..లేదంటే అంతకంటే ఎక్కువ ఉందా అని చూస్తుంటాం. కానీ.. మీరు ఈ స్క్రీన్‌ను, ఈ ప్రపంచాన్ని చూసే మీ కళ్ళ రిజల్యూషన్ ఎంత ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు ప్రఖ్యాత శాస్త్రవేత్త.. ఫోటోగ్రాఫర్ డాక్టర్ రోజర్ క్లార్క్ చేసిన పరిశోధన సమాధానం చెబుతోంది.. మానవ కన్నును ఒక డిజిటల్ కెమెరాలా పరిగణిస్తే.. అది 576 మెగాపిక్సెల్‌లను కలిగి ఉంటుంది. ఈ 576 మెగాపిక్సెల్ సంఖ్యను ఎలా నిర్ధారించారో.. మన కళ్ళు ఏ ఆధునిక కెమెరా కంటే ఎలా భిన్నమైనవో.. మరింత అధునాతనమైనవో తెలుసుకుందాం. డిజిటల్ కెమెరాలో, మెగాపిక్సెల్స్ అంటే దాని సెన్సర్‌పై ఉండే పిక్సెల్స్ లేదా కాంతిని గ్రహించే చుక్కల సంఖ్య అని అర్థం. మానవ కంటిలో, ఈ పనిని కంటి వెనుక భాగంలో ఉండే తెర వంటి రెటీనా నిర్వహిస్తుంది. రెటీనాలో రాడ్లు.. కోన్‌లు అనే రెండు ప్రత్యేక రకాల కాంతి సున్నితమైన కణాలు ఉంటాయి. వాటి విధులు ఏంటో తెలుసుకుందాం. రాడ్లు: ఇవి మసక వెలుతురులో లేదా చీకటిలో చూడటానికి మనకు సహాయపడతాయి. ఇవి సుమారుగా 12 కోట్ల సంఖ్యలో ఉంటాయి. కోన్‌లు: ఇవి రంగులను, సూక్ష్మంగా ఉండే వివరాలను స్పష్టంగా చూడటానికి మనకు సహాయపడతాయి. వీటి సంఖ్య సుమారు 6 నుండి 7 మిలియన్ల వరకు ఉంటుంది. డాక్టర్ క్లార్క్ మొత్తం మానవ దృష్టి క్షేత్రాన్ని.. వివరాలను గ్రహించే కంటి సామర్థ్యాన్ని ఒక గణిత సూత్రంలోకి మార్చినప్పుడు, మన మొత్తం దృశ్య