మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్ లో అనుకుంటే చాలు ఫోన్ లో టైపింగ్ అయిపోద్ది
Actor ProfilePolitician

మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్ లో అనుకుంటే చాలు ఫోన్ లో టైపింగ్ అయిపోద్ది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్ లో అనుకుంటే చాలు ఫోన్ లో టైపింగ్ అయిపోద్ది
Asianet News Telugu23 Aug 2026
మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్ లో అనుకుంటే చాలు ఫోన్ లో టైపింగ్ అయిపోద్ది

జస్ట్ ఊహించుకోండి.. మీరు మీ మనసులో ఏదైనా అనుకోగానే, చేతులతో టైప్ చేయకుండా లేదా నోటితో చెప్పకుండానే అది స్క్రీన్‌పై టెక్స్ట్‌గా మారిపోతే ఎంత బాగుంటుంది! వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్‌లా అనిపిస్తోంది కదూ. కానీ ఇప్పుడు ఇది నిజం కాబోతోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇలాంటి ఒక అద్భుతమైన సిస్టమ్‌ను సిద్ధం చేసింది. ఇది మీ మనసులోని మాటను చదివి, నేరుగా టెక్స్ట్‌గా మార్చేస్తుంది. అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీలా దీనికోసం తలలో ఎలాంటి చిప్ పెట్టాల్సిన అవసరం లేదు, సర్జరీ చేయించుకోవాల్సిన పనిలేదు. కేవలం ఒక స్పెషల్ హెల్మెట్ పెట్టుకుంటే చాలు, ఈ మ్యాజిక్ జరిగిపోతుంది. మెటా తెచ్చిన ఈ సరికొత్త బ్రెయిన్ గేమ్‌ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మెటా కంపెనీ 'Brain2Qwerty V2' అనే సరికొత్త ఏఐ సిస్టమ్‌ను డెవలప్ చేసింది. ఇది మీ మెదడులోని కదలికలను అంటే బ్రెయిన్ యాక్టివిటీని గుర్తించి, వాటిని పదాలుగా మార్చగలదు. మెటా కంపెనీ చెప్తున్న దాని ప్రకారం.. పారాలిసిస్, బ్రెయిన్ ఇంజూరీ లేదా ఇతర జబ్బుల వల్ల మాట్లాడలేని, రాయలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరం లాంటిది. ఈ సిస్టమ్ సాయంతో అలాంటి వారు కేవలం ఆలోచించడం ద్వారానే తమ మనసులోని మాటను ఇతరులతో పంచుకోవచ్చు. ఇది మెటా గత ఏడాది తీసుకొచ్చిన Brain2Qwerty రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు సెకండ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఒకవైపు ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ బ్రెయిన్ లోపల చిప్‌ను అమర్చడానికి సర్జరీలపై వర్క్ చేస్తోంది. కానీ మెటా తీసుకొచ్చిన ఈ సిస్టమ్ మాత్రం పూర్తిగా నాన్ ఇన్వేసివ్. అంటే ఎలాంటి సర్జరీ అవసరం లేనిది. దీనికోసం యూజర్ ఒక స్పెషల్ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ఇది చూడటానికి పెద్ద హెయిర్ డ్రైయర్ లాగా కనిపిస్తుంది. ఈ హెల్మెట్‌లో మాగ్నెటోఎన్సెఫాలోగ్రఫీ