
మనం బ్రతకడానికి తింటున్నామా? చావడానికి తింటున్నామా? బయట రోజురోజుకూ పెరిగిపోతున్న తిండి కల్తీలను చూస్తుంటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అన్నా, ఇక్కడి మటన్ వంటకాలన్నా దేశవ్యాప్తంగా భోజన ప్రియులు లొట్టలేసుకుని తినేవారు. కానీ, కొందరు కాసుల కక్కుర్తి పడ్డ నరరూప రాక్షసులు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మొన్నటికి మొన్న మటన్ పేరుతో కుక్క మాంసం అమ్మిన ఘోరాలు మరువకముందే.. తాజాగా భాగ్యనగరంలో మటన్ పేరుతో ఎద్దు మాంసం విక్రయిస్తున్న మరో ముఠా గుట్టు రట్టయింది. మీరు హోటళ్లలో వేల రూపాయలు పోసి ఆర్డర్ ఇచ్చుకుని తింటున్నది అసలు మేక మాంసమేనా? లేక మరేదైనా జంతువుదా? అనే అనుమానాలు ఇప్పుడు నగరవాసులను పట్టి పీడిస్తున్నాయి.హైదరాబాద్ నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మల్లేపల్లి ప్రాంతంలో ఈ భయంకరమైన కల్తీ మాంసం దందా వెలుగుచూసింది. ఇక్కడి ఉస్మాన్ మీట్ షాప్ నడుపుతున్న ఉస్మాన్ ఖురేషి అనే వ్యక్తి.. మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని యథేచ్ఛగా కలుపుతూ తక్కువ ధరకు నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై స్థానికులకు అనుమానం వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు రంగు బయటపడింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ (H-FAST) అధికారులు, స్థానిక హబీబ్‌నగర్ పోలీసులు కలిసి సదరు మటన్ షాపుపై మెరుపు దాడి చేశారు. కొండెక్కిన కోడిగుడ్డు ధర! సామాన్యుడికి చికెన్ షాక్..50 కిలోల కల్తీ మాంసం స్వాధీనం.. ల్యాబ్‌కు నమూనాలు!అధికారులు షాపులోకి అడుగుపెట్టి తనిఖీలు చేయగా అక్కడ విక్రయానికి ఉంచిన మాంసాన్ని చూసి అధికారులకే మైండ్ బ్లాంక్ అయింది. అది మేక మాంసం కాదని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, షాపును జల్లెడ పట్టగా ఏకంగా 50 కిలోల కల్తీ (ఎద్దు) మాంసం బయటపడింది. దీంతో వెంటనే ఆ మాంసాన్ని సీజ్ చేసి, నిందితుడు ఉస్మాన్ ఖురేషిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మాంసం నమూనాలను సేకరించి తదుపరి విచారణ