మగస్వామ్యం
Actor ProfileActor

మగస్వామ్యం

Total News1
Movie Updates0
Sources1
మగస్వామ్యంపై కామెంట్లకు కట్టుబడి ఉన్నా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Jun 2026
మగస్వామ్యంపై కామెంట్లకు కట్టుబడి ఉన్నా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నటి దియా మీర్జా (Dia Mirza) ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు దుమారం రేపాయి. పితృస్వామ్యం (patriarchy) వల్లే పర్యావరణ సంక్షోభం (climate crisis) అని ఆమె పేర్కొంది. మగవాళ్ల వల్లే మొత్తం వాతావరణం దెబ్బతిన్నది అన్నట్లుగా మాట్లాడడంతో ఆమెపై అందరూ విరుచుకుపడ్డారు. మగాళ్ళపై ఉన్న వ్యతిరేకతని పర్యావరణానికి ముడి పెడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది అని విమర్శలు చెలరేగాయి. దాంతో, ఈ భామ మళ్ళీ వివరణ ఇస్తూ ఒక వీడియో పెట్టింది. తన మాటలకు కట్టుబడి ఉన్నాను అని పేర్కొంది. వాతావరణ మార్పులకు, పితృస్వామ్యానికి మధ్య సంబంధం ఉందంటూ దియా ఆ వీడియోలో వివరించారు. “వాతావరణ మార్పులకు, పితృస్వామ్యానికి గాఢసంబంధం ఉంది. సంరక్షణ కంటే దోపిడీకి, సమతుల్యత కంటే ఆధిపత్యానికి, దీర్ఘకాలిక శ్రేయస్సు కంటే స్వల్పకాలిక లాభానికి విలువనిచ్చే వ్యవస్థల నుండే ఈ రెండూ ఉద్భవిస్తాయి,” అని ఆమె తెలిపింది. పర్యావరణ వినాశనం భారాన్ని మహిళలే భరిస్తారన్నారు అని ఆమె అన్నారు. “స్త్రీలు, బాలికలను మగవాళ్ళు చూసే విధంగానే, అడవులు, నదులు, సముద్రాలు, పర్యావరణ వ్యవస్థలను తాము వాడుకునే సరుకులుగా చూస్తారు. అందుకే, ఈ సంక్షోభం,” అని ఆమె అంటున్నారు. దియా మీర్జాకి ఇప్పుడు 44 ఏళ్ళు. సినిమాల్లో ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ దక్కుతున్నాయి. ఆమె ఇప్పుడు పర్యావరణ పరిరక్షరాలిగా మారింది. తెలుగులో ఆమె నాగార్జున సరసన 2021లో “వైల్డ్ డాగ్” అనే సినిమాలో నటించింది