మోహన్ లాల్ తో భాగ్యశ్రీ
Actor ProfileActor

మోహన్ లాల్ తో భాగ్యశ్రీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మోహన్ లాల్ తో భాగ్యశ్రీ
Eenadu17 Jul 2026
మోహన్ లాల్ తో భాగ్యశ్రీ

‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది అందాల తార భాగ్యశ్రీ బోర్సే. తనదైన నటనతో కుర్రకారుని అలరించే ఈ భామ.. ఇప్పుడు మలయాళ చిత్రపరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అగ్రహీరో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్‌367’ (వర్కింగ్‌ టైటిల్‌). విష్ణు మోహన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే ప్రకటించిన ఈ సినిమాలో నాయికగా భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేసిందట చిత్రబృందం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు