
Department of Education : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా విధ్వంసమైన విద్యాశాఖను మళ్లీ ప్రగతి పథంలోకి, వికాసం వైపు నడిపిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు


Department of Education : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా విధ్వంసమైన విద్యాశాఖను మళ్లీ ప్రగతి పథంలోకి, వికాసం వైపు నడిపిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

Gandhi Sarovar Project : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన పరివాహక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ బాపూ ఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’కు కేంద్ర ప్రభుత్వం నుండి కీలకమైన గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతో అవసరమైన రక్షణ శాఖ అధీనంలోని 83.81 ఎకరాల భూమిలో పనులు చేపట్టేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ సానుకూల నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భూముల బదలాయింపు ప్రక్రియ పూర్తవడంతో, గత కొంతకాలంగా నలుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు త్వరితగతిన పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది. మహాత్మా గాంధీ స్మృత్యర్థం ఏర్పాటు కాబోతున్న ఈ ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ ద్వారా మూసీ పరీవాహక ప్రాంత రూపురేఖలను అంతర్జాతీయ స్థాయిలో మార్చాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సంకల్పం. బాపూ ఘాట్ పరిసర ప్రాంతాలను కేవలం ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా, తెలంగాణ అస్తిత్వాన్ని, చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా ఒక మహోన్నత సాంస్కృతిక, ప్రజా వారసత్వ ఆస్తిగా (Cultural and Public Heritage Asset) తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం కేటాయించిన ఈ 83.81 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ.. గాంధేయవాద సిద్ధాంతాలను చాటిచెప్పేలా ప్రపంచ స్థాయి మ్యూజియంలు, వాటర్ ఫ్రంట్ ల్యాండ్‌స్కేపింగ్ మరియు సాంస్కృతిక వేదికలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికే సరికొత్త మణిహారంగా నిలవడమే కాకుండా, మూసీ ప్రక్షాళన పనులకు మరింత ఊపునిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Gudivada Amarnath Comments on Anitha : అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు గమనిక: ఈ వెబ్