మిషన్ భగీరథ
Actor ProfileCelebrity

మిషన్ భగీరథ

Total News1
Movie Updates0
Sources1
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వృథాగా పోతున్న తాగునీరు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
Namasthe Telangana15 Jun 2026
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వృథాగా పోతున్న తాగునీరు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

Mission Bhagirath | మాగనూరు జూన్ 15: నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల మధ్య నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. పైప్‌లైన్‌లో పగులు ఏర్పడటంతో పంటపొలాల్లో నీరు భారీగా ఎగసిపడుతోంది. కొంతకాలంగా పైప్‌లైన్‌లో లీకేజీ కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ పథకంలో ఇలాంటి లీకేజీల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరగడమే కాకుండా నీరు వృథా అవుతుందని ఆవేదదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేసి, నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మిషన్ భగీరథ పైప్‌లైన్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు