
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Jyeshtha Purnima 2026 Date significance and rituals: జ్యోతిష్య పండితుల ప్రకారం తెలుగు మాసాల్లోని ప్రతి నెలకు ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు అంటే జూన్ 29న సోమవారం జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకుంటాం. జ్యేష్ఠ అనే పేరులోనే ప్రథమ అని గొప్పదైన మాసం అని అర్థం. ఇది పరిపక్వత, జ్ఞానం, పరిపూర్ణతకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున చాలా మంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు సైతం నిర్వహిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ ఈసారి మనకు బ్రాహ్మీ మూహుర్తంలో ఉదయం 3 గంటల నుంచి సాయత్రం పూట 8 గంటల వరకు ఉంది. అందుకే మనం జ్యేష్ఠ పూర్ణిమను జూన్ 29వ తేదీన జరుపుకుంటాం. ఈ క్రమంలో జ్యేష్ఠ పూర్ణిమ రోజున చేసే పూజలు, వ్రతాలు వెయ్యిరెట్లు గొప్ప ఫలితాల్ని ఇస్తాయంటారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ముఖ్యంగా నదీస్నానాలు, సత్యనారాయణ వ్రతాలు, సోమవారం కూడా కలిసి రావడంతో శివుడి ప్రీతికొరకు పంచామృత అభిషేకం చేయించుకొవాలి. అంతే కాకుండా విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామా పారాయణ చేయాలి. ముఖ్యంగా శని పీడలతో బాధపడుతున్న వారు దానాలు ఈ రోజు పండితులకు ఇస్తే చాలామంచిదంటారు. ఈ రోజున ముఖ్యంగా విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీదేవిని ఆరాధిస్తే అన్ని రకాలైన దోషాలు కూడా పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్యేష్ఠ పూర్ణిమ రోజున చాలా మంది పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తారు. ఈ క్రమంలో రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయాలి. నిమ్మకాయల