మెలోనీ పదే పదే అడిగారు.. ట్రంప్ నోట అదేమాట
Actor ProfilePolitician

మెలోనీ పదే పదే అడిగారు.. ట్రంప్ నోట అదేమాట

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెలోనీ పదే పదే అడిగారు.. ట్రంప్ నోట అదేమాట
Eenadu20 Jun 2026
మెలోనీ పదే పదే అడిగారు.. ట్రంప్ నోట అదేమాట

ఇంటర్నెట్ డెస్క్‌: జీ-7 సదస్సులో ఫొటో కోసం ఇటలీ ప్రధాని ప్రాధేయపడ్డారని ట్రంప్‌ (Donald Trump) ప్రకటనను జార్జియా మెలోని తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఇదే విషయాన్ని ట్రంప్‌ మరోసారి ప్రస్తావిస్తూ ట్రూత్‌ సోషల్‌లో తాజాగా పోస్టు చేశారు. ‘‘ఫ్రాన్స్‌లో జరిగిన సదస్సులో ఫొటో కోసం మెలోనీ పదే పదే అడిగారు. స్వదేశంలో ఆమెకున్న ప్రజాదరణ తగ్గుతోంది. బహుశా.. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా లేదా అభివృద్ధి చేయకుండా నిరోధించే విషయంలో అమెరికాను తిరస్కరించడమే ఇందుకు కారణం కావచ్చు. ఈ విషయంలో నాటో కూడా అలాగే చేసింది. ఇటలీతోపాటు నాటో మిత్రదేశాలను రక్షించడానికి అమెరికా ఏటా వందల బిలియన్ల డాలర్లను అందిస్తున్నప్పటికీ.. వాళ్లు మాకు సహకారం అందించలేదు. ముఖ్యంగా ల్యాండింగ్‌ సదుపాయాలను ఉపయోగించుకోనివ్వలేదు. ఇరాన్‌ను అమెరికా ఓడించిన తర్వాత.. తన బలాన్ని పెంచుకునేందుకు ఇప్పుడు మళ్లీ అమెరికాతో స్నేహం చేయాలని ఆమె కోరుకుంటున్నారు’’ అని ట్రంప్‌ విమర్శించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు