ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఘటగనలో ముసుగు వ్యక్తి చిన్నయ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. చిన్నయ్య తనపై చేసిన వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. తాను ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్లలేదని.. ఎవరినీ కలవలేదన్నారు. చిన్నయ్య నాతో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు గిరీశ్ మట్టణ్ణనవర్ తనకు ఫోన్ చేసి చెప్పారని.. తాను అతడితో తమిళంలో మాట్లాడానన్నారు. చిన్నయ్య తనతో భేటీ అవుతానని చెబితే తాను నిరాకరించానన్నారు. చిన్నయ్య తీరు అనుమానాస్పదంగా ఉందని తాను పోలీస్ ఉన్నతాధికారికి తెలియజేశానన్నారు. ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తానే అప్పటి సీఎం సిద్ధరామయ్యను కోరిన తర్వాతే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందన్నారు.తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మరోసారి స్పందించారు. ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేకి అనే విషయం బయటపడిందన్నారు. పవిత్ర హిందూ దేవాలయం ధర్మస్థల కుట్ర కేసులో ఆయన ఇబ్బందుల్లో పడ్డారని.. మొదటిసారిగా ఆత్మరక్షణలో పడ్డారన్నారు. 'మీలో చాలా రోజుల తర్వాత పశ్చాత్తాపం కనిపిస్తోంది మంచిదే. క్షమాపణ చెప్పి కర్నాటక సిట్ పోలీసుల ముందు నిజం ఒప్పుకోండి, ఇదే పరిష్కారం' అంటూ విష్ణువర్థన్ రెడ్డి ట్వీట్ చేశారు. ధర్మస్థల కేసు అంశంలో విష్ణువర్థన్ రెడ్డి కొంతకాలంగా ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేశారు.. ఆయన వరుసగా ట్వీట్‌లు చేస్తున్నారు.మరోవైపు ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని దాఖలైన కేసులో బెంగళూరు 48వ ఏసీజేఎం కోర్టు మూడు రోజుల క్రితం వారెంట్ జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి. 2019లో దిలీప్‌కుమార్ అనే లాయర్ ప్రకాష్ రాజ్ ఓటర్ ఐడీ కార్డుల అంశంపై బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు
Actor ProfilePolitician
మీలో చాలా రోజుల తర్వాత పశ్చాత్తాపం కనిపిస్తోంది.. విష్ణువర్థన్ రెడ్డి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•3 Jul 2026
మీలో చాలా రోజుల తర్వాత పశ్చాత్తాపం కనిపిస్తోంది.. విష్ణువర్థన్ రెడ్డి