ITR Filing: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులను ఫైల్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఐటీఆర్ ఫైలింగ్‌కు సమయం ఆసన్నమైంది. జులై 31వ తేదీలోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, సరైన ఐటీఆర్ ఫారం ఎంచుకోకపోవడం, మూలధన లాభాలను తప్పుగా నమోదు చేయడం, పాత కంపెనీలు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాలను చూపకపోవడం, బ్యాంక్ అకౌంట్ల వివరాలు చెప్పకపోవడం, అద్దె ఆదాయం, వడ్డీలు, పన్ను మినహాయింపుల వంటి వి సరిగ్గా చూపించకపోవడం చాలా పొరపాట్లు జరుగుతుంటాయి. దీంతో ఐటీ నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే పన్ను రీఫండ్లు ఆలస్యమవుతుంటాయి. మరి ఐటీఆర్ ఫైలింగ్ లో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. ఆస్తుల వివరాలు సరిగ్గా వెల్లడించకపోవడం2026-27 మందిపు సంవత్సరానికి ట్యాక్స్ పేయర్లు చేసే అతిపెద్ద పొరపాటు విదేశీ ఆస్తులను సరిగ్గా వెల్లడించకపోవడమే అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం లేదా విదేశీ ఆస్తులు కలిగి ఉండటం గణనీయంగా పెరిగింది. కానీ, చాలా మంది తమ విదేశీ ఆస్తులను, పెట్టుబడులను రిటర్నుల్లోని షెడ్యూల్ ఎఫ్ఓ లో వివరాలు సరిగ్గా వెల్లడించడంలో విఫలమవుతారు. ఏఐపై ఆధారపడడంప్రస్తుత రోజుల్లో ఎలాంటి నిపుణుల సహాయం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ఉపకరణాల ద్వారా సులభంగా రిటర్నులు ఫైల్ చేశామని కొందరు చెబుతుండడం వినే ఉంటారు. ఇలాంటివి వాడకం ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, రిటర్నుల ఫైలింగ్ లాంటి చట్టపరమైన, తప్పనిసరి ప్రక్రియల కోసం వాటిని పూర్తిగా విశ్వసించే స్థాయికి చేరుకోలేదు. కేవలం ఒకటి లేదా రెండు ఆదాయ వనరులు ఉండి, మూలధన లాభాలు, నష్టాలు లేనివి అయితే కొంత సహాయం దొరకవచ్చు. కానీ, సులభమైన రిటర్నులు సమర్పించేందుకు ఐటీ శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ ఎంతో సురక్షితమైంది. అందులో ఆదాయ వివరాలు ముందుగానే నింపి ఉంటాయి. కాబట్టి వాటిని సరిచూసుకుని, సులభంగా ఫైల్ చేయడం మంచిది. నిపుణులను సంప్రదించకపోవడంచాలా సందర్భాల్లో అవగాహన లోపం వల్లే తప్పులు
Actor ProfilePolitician
మీరు ఫైలింగ్ కు సిద్ధమవుతున్నారా? ఈ తప్పులు చేస్తే నోటీసులొస్తాయ్.. చెక్ చేసుకోండి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•26 Jul 2026
మీరు ఫైలింగ్ కు సిద్ధమవుతున్నారా? ఈ తప్పులు చేస్తే నోటీసులొస్తాయ్.. చెక్ చేసుకోండి