మీ రూపాయికీ చిల్లు పడుతోందా
Actor ProfilePolitician

మీ రూపాయికీ చిల్లు పడుతోందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ రూపాయికీ చిల్లు పడుతోందా
Sakshi11 Aug 2026
మీ రూపాయికీ చిల్లు పడుతోందా

కరెన్సీ విలువ పడిపోయి... పెరుగుతున్న ఖర్చులు తక్షణ దిద్దుబాటు చర్యలతోనే రిలీఫ్‌ సాధ్యం ఎమర్జెన్సీ ఫండ్‌కి ఎస్‌.. భారీ రుణాలకు నో ప్రతి ఖర్చుకీ లెక్కుండాలి.. బీమా చూసుకోవాలి బంగారాన్ని కొనవద్దంటూ ఆంక్షలు విధించినా... దిగుమతి సుంకం అమాంతం పెంచేసినా... అదంతా మన దిగుమతుల బిల్లు భారం తగ్గించుకోవటానికే. విదేశీ ప్రయాణాలు వద్దని సాక్షాత్తూ ప్రధానమంత్రి సూచించటం ఒకెత్తయితే... దేశీయంగా పెట్రోలు వాడకాన్ని తగ్గించడానికి అందులో కలిపే ఇథనాల్‌ మోతాదును పెంచటం కూడా చేస్తోంది ప్రభుత్వం. పైపెచ్చు 100 శాతం ఇథనాల్‌ అంటూ కొత్త వాహనాలను, ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు కూడా. ఇదంతా ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గించుకోవటానికి. అంతకంతకూ కరిగిపోతున్న రూపాయి విలువను కాస్తయినా పటిష్ఠంగా ఉంచడానికి. కానీ డాలర్‌తో మారకంలో రూపాయి ఇప్పటికే భారీగా పతనమైపోయింది. ఎల్రక్టానిక్‌ గాడ్జెట్లతో సహా తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన చాలా వస్తువుల ధరలు పైకి ఎగిశాయి. దేశీయంగా పెట్రోలు ధరలు పెరగటం ఫలితంగా చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వెరసి సామాన్యుడి బడ్జెట్‌ తల్లకిందులయింది. ఈ నేపథ్యంలో ఏ వర్గంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? వారు బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని వివరించేదే ఈ సాక్షి వెల్త్‌ స్టోరీ... ఐటీ, ఫైనాన్స్, స్టార్టప్‌లవ్యాప్తంగా ఒకప్పుడు పుష్కలంగా కొలువులు వచి్చనా... ఇప్పుడు ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారింది. నెలంతా అప్పులతో నెట్టుకొచ్చి జీతం రాగానే చెల్లించేసే చాలా మంది వేతన జీవులకు ఈ అనిశ్చితి సమస్యాత్మకంగా ఉంటోంది. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు గుదిబండగా మారుతున్నాయి. జీతాలు పెరిగినా పెరగకపోయినా.. పెరిగిపోయే స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడమెలా అని తలపట్టుకుంటున్నారు. అటు పదవీ విరమణ చేసిన వారి సంగతి తీసుకుంటే వైద్యం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది కదా అని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో కాస్తో కూస్తో దాచుకున్నా.. దానిపై వచ్చే వడ్డీ అంతంతమాత్రమే. ఈ వడ్డీ పెరిగే ధరల భారాన్ని తట్టుకునేందుకు