మారిన మేఘాంశ్ శ్రీహరి సినిమా పేరు
Actor ProfileActor

మారిన మేఘాంశ్ శ్రీహరి సినిమా పేరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మారిన మేఘాంశ్ శ్రీహరి సినిమా పేరు
Chitrajyothy13 Jul 2026
మారిన మేఘాంశ్ శ్రీహరి సినిమా పేరు

రియల్ స్టార్, స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'స్టూడెంట్‌'. విజేత పరీఖ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని బాలు తత్త్వమసి డైరెక్ట్ చేస్తున్నారు. రియల్‌ స్టార్, స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ 'రాజ్‌దూత్‌' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందులో లేకపోయింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మేఘాంశ్‌ హీరోగా నటించినా... అవేవీ పూర్తయ్యి జనం ముందుకు రాలేదు. కాకపోతే అదే సమయంలో మొదలైన ఓ సినిమా ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుని విడుదలకు సిద్థమౌతోంది. 2023లో మొదలైనప్పుడు ఈ సినిమాకు 'అతని పేరు భాను' అనే పేరును మేకర్స్ అనుకున్నారు. ఇప్పుడు రిలీజ్‌కు సిద్థమయ్యే సరికీ దానికి 'స్టూడెంట్‌' అనే పేరు ఖరారు చేశారు. మేఘాంశ్‌ శ్రీహరి (Megamsh Srihari) సరసన విజేత పరీఖ్‌ (Vijeta Parikh) హీరోయిన్‌గా నటిస్తున్న 'స్టూడెంట్‌' సినిమాను బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి దీనికి సహ నిర్మాతలు. గతంలో కిరణ్‌ అబ్బవరం హీరోగా 'సెబాస్టియన్‌ పి.సి. 524' మూవీని తెరకెక్కించిన బాలాజీ సయ్యపురెడ్డి... 'స్టూడెంట్‌' సినిమాను బాలు తత్త్వమసి (Balu Tatvamasi) పేరుతో డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మేఘాంశ్‌ శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్ లో మేఘాంశ్‌ శ్రీహరి ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. పవర్ స్టార్ సినిమాకు బ్యానర్స్ కట్టడం, జామెట్రీ బాక్స్‌లోని డివైడర్‌ను క్లాస్‌లో కాకుండా ఫైట్స్‌కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయడం... ఇలా స్టూడెంట్‌ లైఫ్‌లో భాగమైనవన్నీ ఈ పోస్టర్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నాయి. 'ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు' అని రాసిన కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుండగా.. 'ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను..' అని