మీరంతా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు.. అందుకే నేను జాగ్రత్త పడుతున్నా
Actor ProfileActor

మీరంతా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు.. అందుకే నేను జాగ్రత్త పడుతున్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీరంతా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు.. అందుకే నేను జాగ్రత్త పడుతున్నా
Eenadu27 Jun 2026
మీరంతా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు.. అందుకే నేను జాగ్రత్త పడుతున్నా

ఇంటర్నెట్‌ డెస్క్: సాయి దుర్గా తేజ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్‌.కె.పి దర్శకత్వంలో రానుంది. ఈ సినిమా (Sambarala YetiGattu) విడుదల ఆలస్యం కావడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఈ ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందించారు. సినిమాల ఎంపికలో తాను ఎందుకు ఇంత సమయం అవసరమవుతోందో వివరించారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వీక్షిస్తున్నట్లు తెలిపారు. అన్ని జానర్‌లలోని కంటెంట్‌ గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నట్లు చెప్పారు. ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని అందుకే తన సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్లను మెప్పించాలంటే కథల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదన్నారు. అందుకే కాస్త సమయం పడుతోందని స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం తన సర్వస్వం ధారపోస్తూ... శాయశక్తులా శ్రమిస్తున్నట్లు గతంలో సాయి దుర్గా తేజ్ తెలిపారు. దర్శకుడు రోహిత్‌ విజన్‌ అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు. మంచి బృందంతో కలిసి చేస్తున్న ఈ సినిమా తన కెరీర్‌లో ఒక అద్భుతంలా నిలిచిపోతుందని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు