మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై బిహార్‌లో దాడి జరిగింది. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, దాడికి యత్నించిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 21న బిహార్ గోపాల్ గంజ్ జిల్లాలోని బెల్‌సండ్ తివారి టోలా గ్రామంలో పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా భూ వివాదాలు జరుగుతుండగా.. విజయేంద్రనాథ్ త్రిపాఠి పక్క ఇంటి వ్యక్తి రాజేశ్ సాహుతో మాటామాటా పెరిగింది. దాంతో విచక్షణ కోల్పోయిన రాజేశ్ సాహ్ వెంటనే గొడ్డలి తీసుకుని విజయేంద్రనాథ్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విజయేంద్రనాథ్‌ని మొదట గోపాల్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రక్తపు మరకల్లో ఉండగా అతని దుస్తులు కూడా సేకరించారు. సంఘటనా స్థలంలో ఆధారాలు అన్నింటిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. విజయేంద్రనాథ్‌పై గొడ్డలితో దాడి చేసిన రాజేశ్ సాహూని పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యా తండ్రి పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్న పంకజ్ త్రిపాఠి.. ఆ తర్వాత కీ రోల్‌లో వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జన్మించిన పంకజ్ త్రిపాఠికి ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబంలో విజయేంద్రనాథ్ చిన్నవాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడిని
Actor ProfileActor
మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి సోదరుడి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•29 Jun 2026
మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి సోదరుడిపై గొడ్డలితో దాడి.. బిహార్ లో భూ వివాదమే కారణం