మార్కెట్లు దూసుకెళ్లినా.. కుప్పకూలిన టాటా స్టాక్.. ఆ ఒక్క కారణంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు
Actor ProfilePolitician

మార్కెట్లు దూసుకెళ్లినా.. కుప్పకూలిన టాటా స్టాక్.. ఆ ఒక్క కారణంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు

Total News1
Movie Updates0
Sources1
మార్కెట్లు దూసుకెళ్లినా.. కుప్పకూలిన టాటా స్టాక్.. ఆ ఒక్క కారణంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు
Samayam Telugu17 Jun 2026
మార్కెట్లు దూసుకెళ్లినా.. కుప్పకూలిన టాటా స్టాక్.. ఆ ఒక్క కారణంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు

Jaguar Land Rover Outlook : అమెరికా- ఇరాన్ ఒప్పందం కుదిరినప్పటి నుంచి అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు నెలకొన్నాయి. భారత స్టాక్ మార్కెట్లు గత కొంత కాలంగా భారీ ఒడుదొడుకులకు లోనవగా.. ఇక ఇప్పుడు పుంజుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందన్న ప్రకటన వచ్చినప్పుడే గత శుక్రవారం సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1600 పాయింట్లకుపైగా పెరిగింది. ఇక ఈ వారం వరుసగా 3 రోజులు లాభాల్లోనే ముగిశాయి. మొత్తంగా వరుసగా నాలుగో సెషన్ లాభాలు నమోదు చేశాయి. బుధవారం రోజు (జూన్ 17న) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 77,156 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 24,086 వద్ద సెషన్ ముగించింది. ముఖ్యంగా మెటల్, పీఎస్‌యూ, కన్జూమర్ డ్యూరబుల్ స్టాక్స్ దన్నుగా నిలిచాయి. ఈ రంగాల్లో భారీ కొనుగోళ్లతో సూచీలు దూసుకెళ్లాయి. ఇంకా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను ఇవాళ అర్ధరాత్రి ప్రకటించనున్న వేళ మదుపరులు కాస్త అప్రమత్తత పాటించారు. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో ట్రెంట్, BSE, టాటా స్టీల్, ఎటర్నల్, ఇన్ఫోసిస్ షేర్లు పుంజుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకీ షేర్లు పడిపోయాయి. ఎస్బీఐ, రిలయన్స్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ కూడా రాణించాయి.అయితే ఇక్కడే దిగ్గజ టాటా గ్రూప్ స్టాక్ టాాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ (TMPV) షేర్లు భారీగా పతనం అయ్యాయి. కిందటి రోజు ఈ స్టాక్ ధర రూ. 393.60 వద్ద ముగియగా బుధవారం రోజు స్వల్పంగా లాభాల్లో ఓపెన్ అయినా తర్వాత ఒక్కసారిగా పతనమైంది. ఇంట్రాడేలో దాదాపు 10 శాతం వరకు కుదేలై రూ. 355 వద్ద సెషన్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 8.30 శాతం నష్టంతో రూ. 360.95 వద్ద సెషన్ ముగించింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి