మార్కెట్లు దూసుకెళ్తున్నా 3 శాతం పడిపోయిన ఎల్ఐసీ షేరు
Actor ProfileCelebrity

మార్కెట్లు దూసుకెళ్తున్నా 3 శాతం పడిపోయిన ఎల్ఐసీ షేరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మార్కెట్లు దూసుకెళ్తున్నా 3 శాతం పడిపోయిన ఎల్ఐసీ షేరు- కారణం ఇదే- ఒక్కో షేరుకు 10 రూపాయలొస్తాయ్
Samayam Telugu19 Jul 2026
మార్కెట్లు దూసుకెళ్తున్నా 3 శాతం పడిపోయిన ఎల్ఐసీ షేరు- కారణం ఇదే- ఒక్కో షేరుకు 10 రూపాయలొస్తాయ్

LIC Shares Fall : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఒకవైపు క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్నాయి. ఇవి యుద్ధం ముందటి స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలోనూ మంచి జోష్ కనిపిస్తోంది. గత వారం నుంచి భారత స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. వరుస సెషన్లలో సూచీలు పుంజుకుంటూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. ఇవాళ కూడా అదే జోష్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం జూన్ 25న (గురువారం) వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా లాభంతో 77,500 మార్కుపైన ట్రేడవుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 170 పాయింట్లు పుంజుకొని ప్రస్తుతం 24,190 వద్ద కొనసాగుతోంది. ఎస్బీఐ, రిలయన్స్, ఎం అండ్ ఎం, హిందుస్థాన్ యూనిలివర్, బీఎస్ఈ, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ ఇలా పలు హెవీ వెయిట్ స్టాక్స్ అన్నీ దూసుకెళ్తున్నాయి. మంచి లాభాల్లో ఉన్నాయి. ఇదిలా ఉన్నప్పటికీ భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ షేరు భారీగా పతనం అవుతోంది. కిందటి సెషన్‌లో ఎల్ఐసీ షేరు రూ. 436.60 వద్ద ముగియగా ఇవాళ నేరుగా దాదాపు 3 శాతం పతనంతో రూ. 423 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా ఇంట్రాడేలో మరింత తగ్గి రూ. 421.65 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. ఇప్పుడు రాస్తే సమయంల ో ఉదయం 11.45 గంటలకు చూస్తే 3 శాతం నష్టంతోనే రూ. 423 స్థాయిలో ట్రేడవుతోంది. ఒక్కో షేరుకు రూ. 10 డివిడెండ్ఈ స్టాక్ ఇవాళ ఇంతలా పతనం అయ్యేందుకు ప్రధాన కారణం ఎక్స్ డివిడెండ్ అవడమే. ఇటీవల 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఎల్ఐసీ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 10 చొప్పున ఫైనల్ డివిడెండ్ చెల్లించనున్నట్లు