మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి
Actor ProfileActor

మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి
TV9 Telugu19 Jun 2026
మార్కెట్ ఏంటి.. పెడుతున్న బడ్జెట్ ఏంటి

హీరోల మార్కెట్ ఏంటి..? నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ ఏంటి..? అసలేమైనా పొంతన ఉందా..? ఆ హీరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వసూలు చేసిన అమౌంట్ కంటే డబుల్ బడ్జెట్‌ పెట్టి వాళ్లతో సినిమాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఆ రిస్క్ వర్కవుట్ అవుతుందా..? నిజంగా మీడియం రేంజ్ హీరోలకు అంత మార్కెట్ ఉందంటారా..? అసలేంటి దర్శక నిర్మాతల ధైర్యం..? టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘భారీ బడ్జెట్’, ‘మైండ్ బ్లోయింగ్ VFX’.. ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా రావట్లేదు. పెద్ద హీరోలే కాదు.. మీడియం రేంజ్ సినిమాలకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం పోస్తున్నాయి. అసలు బడ్జెట్‌లో కాంప్రమైజ్ కాకుండా.. గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేయడానికి ముస్తాబవుతున్నారు. అలాంటి సినిమాలకే గిరాకీ బాగా ఉంది కూడా. చూస్తున్నారుగా.. ఈ గ్లింప్స్ చూస్తుంటే తెలుగు సినిమాలా కూడా కనిపించట్లేదు.. వృషకర్మ కోసం మేకర్స్ ఏకంగా 120 కోట్లు పెడుతున్నారు.. టీజర్ చూస్తుంటే గూస్‌బంప్స్ తెప్పించే సినిమా అని అర్థమవుతోంది. తన శిష్యుడు కార్తీక్ దండు చేసిన మ్యాజిక్ చూసి సుకుమార్ సైతం ఫిదా అయిపోయారు. కానీ చైతూ మార్కెట్ కంటే ఇది డబుల్ ఖర్చుతో వస్తుంది. సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్‌తో అదరగొడుతున్న సంబరాల ఏటిగట్టు కోసం కూడా అక్షరాలా 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి బడ్జెట్ విషయంలో అస్సలు వెనకాడకుండా సినిమాకి గ్రాండ్ బ్యాకింగ్ ఇస్తున్నారు. దర్శకుడు రోహిత్ ఒక సరికొత్త విజువల్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు.. కానీ బడ్జెట్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న నాగబంధం బడ్జెట్ 80 కోట్లు అంటున్నారు.. స్టార్ వ్యాల్యూ లేకుండా కంటెంట్ కోసమే ఖర్చు చేస్తున్నారీయన. దీనిపై అభిషేక్‌కు ఉన్న నమ్మకం చూస్తుంటే.. ఔట్ పుట్‌పై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమైపోతుంది. సినిమాలో ఉండబోయే ప్రతీ విజువల్ అద్భుతంగా