ముంబైలో బెస్ట్’ బస్సుల నిరవధిక సమ్మె.. స్తంభించిన రవాణా
Actor ProfileCelebrity

ముంబైలో బెస్ట్’ బస్సుల నిరవధిక సమ్మె.. స్తంభించిన రవాణా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముంబైలో బెస్ట్’ బస్సుల నిరవధిక సమ్మె.. స్తంభించిన రవాణా
Vaartha19 Jun 2026
ముంబైలో బెస్ట్’ బస్సుల నిరవధిక సమ్మె.. స్తంభించిన రవాణా

Mumbai BEST bus strike: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (BEST) సంస్థ ఉద్యోగులు శుక్రవారం నుండి నిరవధిక సమ్మెకు దిగడంతో, నగరంలో ప్రజా రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 యూనియన్లతో కూడిన ‘బెస్ట్ సంయుక్త కార్మిక కృతీ సమితి’ పిలుపునిచ్చిన ఈ సమ్మె కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సమ్మె ప్రభావంతో ఉదయం పూట ముంబై వ్యాప్తంగా ఉన్న 27 బెస్ట్ డిపోల నుండి బస్సులు దాదాపుగా బయటకు రాలేకపోయాయి. సమ్మె చేస్తున్న ఉద్యోగులు బస్సులను డిపోల నుండి బయలుదేరనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉదయం రద్దీ సమయంలో ఆఫీసులకు, విధులకు వెళ్లే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆటోరిక్షాలు, టాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు Ola, Uber మెట్రో వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. Read Also: Rahul Gandhi Birthday: రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కార్మిక సంఘాలు తమ సుదీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. వారి ముఖ్యమైన డిమాండ్లు క్రింది విధంగా ఉన్నాయి: సమ్మెకు దిగకుండా ఉద్యోగులను నిలువరిస్తూ పారిశ్రామిక న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సైతం కార్మికులు బేఖాతరు చేశారు. అత్యవసర సేవల అంతరాయాన్ని నిషేధించే ‘మహారాష్ట్ర అత్యవసర సేవల నిర్వహణ చట్టం’ (MESMA) ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించినప్పటికీ, ఉద్యోగులు ఆందోళనను విరమించలేదు. కాగా, రవాణా సేవలకు ఆటంకం కలిగించినా లేదా ‘బెస్ట్’ ఆస్తిని ధ్వంసం చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు హెచ్చరించారు. ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ తర్వాత నగరంలో రెండవ అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ అయిన బెస్ట్, తన బస్సు సర్వీసుల ద్వారా ప్రతిరోజూ సుమారు 25 లక్షల మంది ప్రయాణికులను