మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
Actor ProfilePolitician

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
Telugu Times18 Jul 2026
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

మోపిదేవి: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నాగపుట్ట వద్ద పాలుపోసి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంత్రి నారా లోకేష్ ను ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, మండలి విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, భాష్యం ప్రవీణ్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్, జోనల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు