మొన్న పవన్.. ఇప్పుడు ఎన్టీఆర్.. సింగ్ గీతం’
Actor ProfileActor

మొన్న పవన్.. ఇప్పుడు ఎన్టీఆర్.. సింగ్ గీతం’

Total News1
Movie Updates0
Sources1
మొన్న పవన్.. ఇప్పుడు ఎన్టీఆర్.. సింగ్ గీతం’పై ప్రశంసలు
Chitrajyothy15 Jun 2026
మొన్న పవన్.. ఇప్పుడు ఎన్టీఆర్.. సింగ్ గీతం’పై ప్రశంసలు

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన గోల్డెన్ బ్లాక్ బస్టర్ ‘సింగ్ గీతం’ చిత్రానికి ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చిత్ర బృందాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) దర్శకత్వంలో వచ్చిన గోల్డెన్ బ్లాక్ బస్టర్ ‘సింగ్ గీతం’ (Sing Geetham) చిత్రానికి ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR).. చిత్ర బృందాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ‘సింగ్ గీతం’ చిత్రం హృదయాన్ని తాకే అద్భుతమైన సినీ అనుభూతి అని పేర్కొన్న ఎన్టీఆర్.. 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు సృజనాత్మకత, కథల పట్ల ఉన్న తపన, ఆలోచనా విధానం ఎంతగానో ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నారు. తరతరాల సినీ అభిమానులకు ఆయన ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటారని కొనియాడారు. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత నాగ్ అశ్విన్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. దశాబ్దాలుగా సింగీతం కలగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడం చాలా గొప్ప విషయమని, భారతీయ సినీ చరిత్రలో అత్యంత వినూత్న దర్శకుల్లో ఒకరైన సింగీతం లెగసీకి ‘సింగ్ గీతం’ అందమైన నివాళిగా నిలిచిందన్నారు. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పనితీరును కూడా ఎన్టీఆర్ ప్రశంసించారు. ఆయన అందించిన సంగీతం చిత్రంలోని భావోద్వేగాలను మరింతగా ప్రేక్షకుల హృదయాలకు చేరవేసి, కథకి ప్రత్యేక బలాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే సినిమా ప్రమోషన్ విషయంలో మేకర్స్ అనుసరించిన వినూత్న విధానం కూడా, తనను ఎంతో ఆకట్టుకుందని ఎన్టీఆర్ వెల్లడించారు. సినిమా