మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా
Actor ProfilePolitician

మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్
Sakshi19 Jul 2026
మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్) చేసిన అనుచిత వ్యాఖ్యాలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ఒక కథను చెబుతూ, మాజీ సీఎం స్టాలిన్‌ కుమారుడు, ఉదయనిధిని ఉద్దేశించి "మీ నాన్న ఎక్కడ?" అంటూ పరోక్షంగా సెటైర్ వేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేసిన మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్, తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో టీవీకే (TVK) పార్టీ చేతిలో ఊహించని పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ ఉదయనిధిని ఉద్దేశించి "మీ నాన్న ఎక్కడ?" అంటూ ప్రశ్నించడం, అటు ఈ రాజకీయ రగడ కాస్తా వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం కలకలం రేపింది. సీఎం విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే నేత స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలు ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా సీఎం వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. "నేను అసెంబ్లీలో లేకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉన్నాను. ప్రజలు నన్ను ఎక్కడ వెతికినా నేను అక్కడే ఉంటాను" అని కౌంటర్‌ ఇచ్చారు. డీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. "మా నాయకుడిని చూసి మీ నాన్న ఎక్కడ అని అడిగారు కదా? ఆయన వస్తారు.. చాలా త్వరలోనే అసెంబ్లీలోకి అడుగుపెడతారు. మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారు" అంటూ రాబోయే ఉప ఎన్నికల్లో స్టాలిన్ పోటీ చేయబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం విజయ్ వ్యాఖ్యలపై వారి కూటమి భాగస్వామి, వీసీకే (VCK) అధినేత తిరుమావళవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సభామర్యాద కాదని హితవు పలికారు. సీఎం విజయ్ వ్యాఖ్యలకు ప్రతిసవాల్‌గా ఉదయనిధి స్టాలిన్ ఎక్స్‌