
సైబర్ నేరగాళ్ళు రూట్ మారుస్తున్నారు. ఇప్పటి దాకా ఎన్నో రకాల మోసాలు చేసినవాళ్ళు ఇప్పుడు సెలబ్రెటీలపై కన్నేశారు. తమ మోసాల కోసం వారిని యూజ్ చేసుకుంటున్నారు. అలా తాజాగా మీనాక్షి చౌదరిని అడ్డం పెట్టుకుని చీట్ చేయబోయిన వాళ్ళకు షాక్ తగిలింది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచమంతా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఫేక్ ఐడీల బెడద కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా ఫేమ్ ఉన్న సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతోంది.తాజాగా టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi chaudhary )కూడా ఈ ఫేక్ ఐడీ మోసానికి గురయ్యారు. తన పేరు, ఫోటో, ఫేక్ నంబర్‌తో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మోసాలకు తెగబడుతున్నట్టు మీనాక్షి చౌదరి దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ముద్దుగుమ్మ తన పేరుతో ఫేక్ నంబర్ నుంచి కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని కోరింది. ఇలాంటి ఫేక్ ఐడీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లేకపోతే సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉంది' అంటూ అభిమానులను హెచ్చరించింది. మీనాక్షి చౌదరి వెంటనే ఈ విషయంపై స్పందించాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో అభిమానులకు జాగ్రత్త చెప్పడం సినీ నటుల రెస్పాన్సిబులిటీ అని.. ఆ విషయంలో మీనాక్షి చొరవ బాగుందని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి మీనాక్షి వెంటనే రెస్పాండ్ కావడం మంచిదైంది. లేదంటే ఎంత మంది ఆ సైబర్ నేరగాళ్ళు చేతికి చిక్కేవారో