మెదక్ జిల్లాలో అమానుషం.. కడుపులోకి బిడ్డకు పరీక్ష చేయించాలని టార్చర్.. భార్య ఏంచేసిందంటే
Actor ProfilePolitician

మెదక్ జిల్లాలో అమానుషం.. కడుపులోకి బిడ్డకు పరీక్ష చేయించాలని టార్చర్.. భార్య ఏంచేసిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెదక్ జిల్లాలో అమానుషం.. కడుపులోకి బిడ్డకు పరీక్ష చేయించాలని టార్చర్.. భార్య ఏంచేసిందంటే
Zee Telugu2 Aug 2026
మెదక్ జిల్లాలో అమానుషం.. కడుపులోకి బిడ్డకు పరీక్ష చేయించాలని టార్చర్.. భార్య ఏంచేసిందంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pregnant woman commits suicide medak over dna test harassment: ఇటీవల కొంత మంది భార్యభర్తలు పెళ్లి అనే పవిత్ర బంధానికి మాయని మచ్చగా మారుతున్నారు. పెళ్లిళ్లు చేసుకుని ఒకర్ని మరోకరు చంపుకుంటున్నారు. మరికొంత మంది కట్టుకున్న వాళ్లను అనుమానంతో టార్చర్ చేసి హత్యలు చేసుకునేలా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తమ భర్తలు ఆఫీసులకు వెళ్తే వారిపైన అనుమానం పెట్టుకుంటున్నారు. ఇంట్లో భార్యలు ఉంటే సీసీ కెమెరాలు పెట్టి వారిపైన నిఘాలు పెడుతున్నారు. ఈ విధంగా పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఒక భర్త అనుమానంతో టార్చర్ చేసి తన భార్య ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిపెద్దపూర్‌ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడాదిన్నర క్రితం సుస్మిత, అభిలాష్‌లకు వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితం వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ భర్త అభిలాష్ తరచుగా భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భిణి. ఇటీవల ఆమెకు కడుపులో ఉన్న బిడ్డపై కూడా అనుమానం పెంచుకున్నాడు. గర్భంలోని శిశువుకు DNA పరీక్ష చేయించాలని భర్త, అత్త వేధింపులు చేయడం ప్రారంభించారు. ఈ వేధింపులు కాస్త పీక్స్ కు చేరాయి. ఇటు ఇంట్లో వారికి చెప్పలేక అటు.. భర్త, అత్తమామల టార్చర్ భరించలేక నిండు గర్భిణి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కాస్త స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. Read more: Hyderabad