ముందు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అంది.. దెబ్బకు ఆమెను తీసేసి సోనాలి బెంద్రే పెట్టుకున్నారు
Actor ProfileActor

ముందు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అంది.. దెబ్బకు ఆమెను తీసేసి సోనాలి బెంద్రే పెట్టుకున్నారు

Total News1
Movie Updates0
Sources1
ముందు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అంది.. దెబ్బకు ఆమెను తీసేసి సోనాలి బెంద్రే పెట్టుకున్నారు
TV9 Telugu16 Jun 2026
ముందు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అంది.. దెబ్బకు ఆమెను తీసేసి సోనాలి బెంద్రే పెట్టుకున్నారు

ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా మురారి, మహేష్ కెరీర్ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఫ్యామిలీ ప్రేక్షకులను మహేష్ బాబును దగ్గర చేసిన మురారి చిత్రం విడుదలై ఈరోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. దర్శకుడు కృష్ణవంశీ స్క్రీన్ ప్లే, మహేష్ బాబు నటన, అద్భుతమైన కథ కలిసి మురారిని ఒక క్లాసిక్‌గా నిలిపాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, ఆసక్తికర విషయాలను సినీ విశ్లేషకులు చిలకగట్టి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన మాట్లాడుతూ.. కృష్ణవంశీ మొదట మహేష్ బాబుతో ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని అనుకున్నారు. అయితే, అంతఃపురం సినిమా పూర్తయిన తర్వాత పాపికొండల్లో స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో, ఇందిరా గాంధీ కుటుంబంలో జరిగిన ఆకస్మిక మరణాల గురించి చర్చ జరిగిందట. అక్కడ ఒక ఆయుర్వేద వైద్యుడు శాపం కారణం అయి ఉండొచ్చని చెప్పడంతో కృష్ణవంశీ ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో, ఒక ప్రముఖ వ్యక్తి తన ఇంటి పాలేరు భార్య శాపనార్థాలు పెట్టిన తర్వాత వారి కుటుంబంలో వరుస ఆకస్మిక మరణాలు సంభవించిన విషయాన్ని తెలిపారట. ఈ సంఘటనల స్ఫూర్తితోనే శాపం నేపథ్యంలోని మురారి కథను సిద్ధం చేసుకున్నారు కృష్ణవంశీ. నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు, కృష్ణ మొదట వినిన రొమాంటిక్ కథను వదిలి, ఈ కొత్త కథను చెప్పినప్పుడు కృష్ణవంశీని సందేహించారట. మహేష్‌తో చర్చించుకొని నిర్ణయం తీసుకోమని కృష్ణ చెప్పారంట. కృష్ణవంశీ మాత్రం ఈ సినిమా 20-30 ఏళ్ల పాటు మాట్లాడుకుంటారని, ఒక రొమాంటిక్ కథ అయితే వచ్చి, వెళ్లిపోతుందని గట్టిగా నమ్మారు. మహేష్ బాబు దర్శకుడి విజన్‌ను పూర్తిగా నమ్మరు. అంతే కాదు మురారి నిర్మాణంలో పలు రాజీలు చోటు చేసుకున్నాయి. బామ్మ పాత్ర కోసం షావుకారు జానకిని అనుకున్నా, డేట్స్ సమస్యతో సుకుమారిని ఎంపిక