మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు
Actor ProfilePolitician

మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు
Sakshi10 Aug 2026
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు

భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు. మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది. భారత్‌లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు. ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్‌పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు) మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్ YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్