
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన, అతిపెద్ద ప్రజాస్వామ్య మార్కెట్ ఆర్థిక వ్యవస్థలైన భారత్ - జపాన్ దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అస్థిరమైన రాజకీయ, ఆర్థిక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర నమ్మకమే అతిపెద్ద ఆస్తి అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జూలై 1 నుంచి 3 వరకు భారతదేశానికి విచ్చేసిన జపాన్ నూతన ప్రధానమంత్రి సనాయే తకైచితో హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆటోమొబైల్ నుండి ఎలక్ట్రానిక్స్ రంగం వరకు భారత్ వృద్ధిలో జపాన్ ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలిచిందని, నేటి తకైచి పర్యటనతో ఈ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.రక్షణ రంగంలో చారిత్రాత్మక మైలురాయిభారత్-జపాన్ రక్షణ సాంకేతిక భాగస్వామ్యంలో భాగంగా ఇరు దేశాలు తొలిసారిగా సంయుక్త అభివృద్ధి (Co-development) ప్రాజెక్టుపై సంతకాలు చేశాయి.యూనికార్న్ (UNICORN) ప్రాజెక్ట్: నౌకాదళానికి ఉపయోగపడే నావల్ రేడియో యాంటెన్నా యూనికార్న్ (Naval Radio Antenna UNICORN) సాంకేతికతను ఇరు దేశాలు ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్నాయి.ప్రాంతీయ శాంతి: ఈ జాయింట్ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటూ, సముద్ర తీర భద్రతను మెరుగుపరచడం మరియు ప్రాంతీయ శాంతిని కాపాడటం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఏరికోరి అదృష్టాన్ని తీసుకొచ్చే ఇత్తడి తాబేలును ఎంచుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ నా పెద్దన్న.. జపాన్ పీఎం ప్రశంసలుజపాన్ ప్రధాని సనాయే తకైచి మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యవహారాలు గందరగోళంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, జపాన్ దేశాలు తమ సొంత బలాలను ఉపయోగించుకుంటూ మరింత బలంగా, సంపన్నంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు సముద్ర