మోదీ నిద్రలేచే ఉంటారులే..’ ఉదయం 6 గంటలకు ఫోన్ చేయాలనుకున్న ట్రంప్
Actor ProfilePolitician

మోదీ నిద్రలేచే ఉంటారులే..’ ఉదయం 6 గంటలకు ఫోన్ చేయాలనుకున్న ట్రంప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మోదీ నిద్రలేచే ఉంటారులే..’ ఉదయం 6 గంటలకు ఫోన్ చేయాలనుకున్న ట్రంప్
Eenadu21 Aug 2026
మోదీ నిద్రలేచే ఉంటారులే..’ ఉదయం 6 గంటలకు ఫోన్ చేయాలనుకున్న ట్రంప్

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇరు దేశాధినేతల స్నేహం మూలస్తంభం అని యూఎస్‌ రాయబారి సెర్గియో గోర్‌ అన్నారు. వాషింగ్టన్‌ వేదికగా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (USISPF)లో పాల్గొన్న ఆయన.. మోదీ-ట్రంప్‌ (Modi-Trump) బంధాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్న ఆయన.. ప్రధాని మోదీకి ఓసారి ట్రంప్‌ ఉదయం ఆరు గంటలకే ఫోన్‌ చేయాలనుకున్నట్లు తెలిపారు. ‘‘రెండు నెలల కిందట మియామిలో యూఎఫ్‌సీ ఈవెంట్‌ జరిగింది. ఆ సమయంలో నేను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉన్నాను. వేదిక పక్కన మేం మాట్లాడుకుంటూ ఉండగా.. ‘మోదీ (PM Modi)కి కాల్‌ చేద్దాం’ అని ట్రంప్‌ అన్నారు. ‘ఇప్పుడు భారత్‌లో సమయం ఉదయం 6 గంటలు’ అని నేను చెప్పా. దానికి అధ్యక్షుడు బదులిస్తూ.. ‘ఏం ఫర్వాలేదు. ఆయన (మోదీ) నిద్రలేచే ఉంటారు. ఎక్కువ సేపు పడుకోరు. ఆయనకు నేనంటే ఇష్టం’ అని అన్నారు. ఆ తర్వాత ట్రంప్‌ (Donald Trump) వేరే బాధ్యతల్లో ఉండటంతో మోదీతో కాల్‌ను మరుసటి రోజుకు షెడ్యూల్‌ చేశారు. అయితే, ఈ సంఘటన వారిద్దరి మధ్య మైత్రిని చాటిచెబుతుంది. ఎవరితోనైనా స్నేహం చేస్తే.. అన్నిటినీ షెడ్యూల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్‌ను చూశాక నాకనిపించింది. మోదీ ఆయనకు గొప్ప స్నేహితుడు’’ అని సెర్గియో గోర్‌ (Sergio Gor) వెల్లడించారు. కాగా.. ఈ సదస్సులో అమెరికా రాయబారి పలు అంశాల గురించి మాట్లాడారు. ఇటీవల అగ్రరాజ్యానికి చెందిన ‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’ పేరులో ‘ఇండో’ పదాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై సెర్గియో గోర్‌ స్పందిస్తూ.. ‘‘లెటర్‌హెడ్‌పై ఏం పేరు ఉందన్న విషయాన్ని పట్టించుకోవద్దు. అమెరికా వాస్తవంగా ఏం చేస్తుందో.. ఆ చర్యలనే గమనించాలి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌-అమెరికా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కలిసి సైనిక విన్యాసాలు చేస్తోంది. రానున్న రెండు వారాల్లో భారత నేవీ బృందం అమెరికాలో పర్యటించనుంది. పేరు మారినంత