హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'దీవాన'. శ్రీకాంత్ సంగిశెట్టి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 20న సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్ ను సోమవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై చిత్ర బృందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'దీవాన' సినిమాలో ముద్దు సీన్స్, వయలెంట్ సీన్స్ లేవని.. అయినా సరే సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇచ్చారని ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి రాలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రీమియర్ షోలు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కానీ సరైన సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వల్లే ప్రీమియర్స్ ప్రదర్శించలేకపోయామని హీరో హర్షిత్ రెడ్డి అన్నాడు. సెన్సార్ పేరుతో ఫిలిం మేకర్స్ క్రియేటివిటీని, తమ సినిమా కలను చంపుతున్నారని డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. ''ఇవాళ నాలో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. మంచి సినిమా చేశారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఫోన్ కాల్స్ ఆగడం లేదు. మరోవైపు మా సినిమాను ఇంకాస్త ఆడియెన్స్ లోకి తీసుకెళ్తే బాగుండేదని అనిపిస్తోంది. మేము రిలీజ్ ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్స్ ప్లాన్ చేశాం అయితే సెన్సార్ సర్టిఫికేషన్ వల్ల అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. మాలాంటి యంగ్ టీమ్ కు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నాను. మీకు సినిమా
Actor ProfileActor
ముద్దు సీన్లు లేకపోయినా సర్టిఫికెట్ ఇచ్చారు.. సెన్సార్ పేరుతో క్రియేటివిటీని చంపుతున్నారు’.. దీవాన’ టీమ్ ఆవేదన
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•3 Jul 2026
ముద్దు సీన్లు లేకపోయినా సర్టిఫికెట్ ఇచ్చారు.. సెన్సార్ పేరుతో క్రియేటివిటీని చంపుతున్నారు’.. దీవాన’ టీమ్ ఆవేదన