మోదీ చూడటానికి చాలా అందంగా ఉంటాడు.. కానీ, కిల్లర్ .. ప్రధాని
Actor ProfilePolitician

మోదీ చూడటానికి చాలా అందంగా ఉంటాడు.. కానీ, కిల్లర్ .. ప్రధాని

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మోదీ చూడటానికి చాలా అందంగా ఉంటాడు.. కానీ, కిల్లర్ .. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు
Samayam Telugu17 Jun 2026
మోదీ చూడటానికి చాలా అందంగా ఉంటాడు.. కానీ, కిల్లర్ .. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు

జీ 7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీని ఒక కిల్లర్, కఠినమైన వ్యాపారి అంటూ అభివర్ణించిన ట్రంప్, ఆయనపై తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ... ‘‘ఆయనతో చర్చలు జరపడంలో చాలా కఠినమైన వ్యక్తి.. ఒక్కసారి ఈయన్ను చూడండి.. మీకు ఒక విషయం చెప్తాను. చూడటానికి ఎంతో అందంగా.. ప్రశాంతమైన వ్యక్తిలా కనిపిస్తారు. కానీ వాస్తవానికి, ఆయన ఒక 'కిల్లర్' అంత కఠినమైన వ్యక్తి. ఎవరైనా సరే సులువుగా బోల్తా పడతారు.. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు.‘‘నేను అధ్యక్షుడిగా ఉన్నంత వరకూ భారతదేశానికి ఒక గొప్ప స్నేహితుడిగా ఉంటాను... ఇక్కడున్న ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమిస్తారు, అలాగే ప్రధాని మోదీపై వారికి అపారమైన గౌరవం ఉంది’’ అని ట్రంప్ అన్నారు. ‘‘ఆయన ఎంతో మంచి వ్యక్తి అని ప్రజలు అంటుంటారు.. కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి అని నేను చెబుతాను.. వ్యాపారాల విషయంలో ఆయన చాలా గట్టిగా వ్యవహరిస్తారు. ఆయన భారతదేశ ప్రజలను ఎంతగానో ప్రేమిస్తారు, అలాగే అమెరికాను కూడా ప్రేమిస్తారు. గతంలో హ్యూస్టన్‌లో 'హౌడీ మోదీ' కార్యక్రమం నిర్వహించాం. ఆ స్టేడియం మొత్తం నిండిపోయింది. భవిష్యత్తులో ఎప్పుడైనా భారత్‌ను సందర్శిస్తాను’’ అని ట్రంప్ అన్నారు.మోదీ తనకున్న స్నేహపూర్వక సంబంధాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఏదైనా దేశం భారతదేశంపై దాడి చేస్తే, మా దేశం ఆదుకుంటుంది." అయితే, ప్రధాని మోదీ నాయకుడిగా ఉండాలి.. ’’ అని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో భారత్ పోషించే పాత్ర గురించి మీరు ఏదైనా ఆశిస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘‘అవును, నేను ఆశిస్తున్నాను. ప్రతి విషయంలోనూ భారత్ పెద్ద పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నాను. ఆయన (ప్రధాని నరేంద్ర మోదీ) నాయకుడిగా ఉన్నంత కాలం, భారత్ కీల పాత్ర పోషిస్తుంది’’ అని చెప్పారు.‘‘భారత ప్రధానితో మేము చాలా మంచి చర్చలు