
అమెరికా అంతరిక్ష రంగంలో అగ్రగామి సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో చారిత్రక సంచలనాలు నమోదయ్యాయి. జూన్ 12,న నాస్డాక్లో ఈ కంపెనీ షేర్లు అధికారికంగా లిస్ట్ అయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ప్రస్తుత, మాజీ ఉద్యోగుల్లో 4,400 మందికి పైగా ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఇంజనీర్లు, టెక్నీషియన్లతో పాటు వెల్డర్లు, క్యాఫేటీరియా సిబ్బంది వంటి సాధారణ ఉద్యోగులు కూడా భారీగా లాభపడటం విశేషం. చాలా మంది గతంలో తక్కువ వేతనాలు స్వీకరించి, బదులుగా ఈక్విటీ తీసుకోవడంతో ఇప్పుడు ఊహించని రీతిలో కోటీశ్వరులయ్యారు. న్యూయార్క్ టైమ్స్ నివేదికలు మరియు హిల్.కామ్ విశ్లేషణల ప్రకారం ఈ ఐపీఓలో భారీ పరిణామాలు జరిగాయి. స్పేస్ఎక్స్ సంస్థలో సుమారుగా 22,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 400 మంది ఉద్యోగులు కనీసం 100 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ హోల్డింగ్స్‌ను సాధించారు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 850 కోట్ల రూపాయలకు సమానం కావడం గమనార్హం. నాడు కంపెనీపై నమ్మకంతో క్యాష్ బోనస్‌లను వదులుకుని స్టాక్ ఆప్షన్లు తీసుకున్న వారందరికీ ఇప్పుడు భారీ లాభాలు దక్కాయి. ఈ ఐపీఓ ప్రక్రియలో భాగంగా స్పేస్ఎక్స్ షేరు ప్రారంభ ధరను 135 డాలర్లుగా నిర్ణయించారు. ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఈ షేర్లు సుమారు 11 నుంచి 19 శాతం వరకు పెరిగి 150 డాలర్ల నుంచి 161 డాలర్లకు చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల పైకి ఎగిసింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ సుమారు 75 బిలియన్ డాలర్లు అంటే 6.4 లక్షల కోట్ల రూపాయలు సమీకరించింది. ఫలితంగా ఇది ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్లో గణనీయమైన వాటా కలిగి ఉన్నందున సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ చారిత్రాత్మక లిస్టింగ్‌తో ఆయన ప్రపంచంలోనే