
ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే చిత్రం AA23 థీమ్ సంగీతం వినిపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. స్లోవాకియా దేశ అత్యున్నత సివిల్ గౌరవం అందుకున్న సందర్భంగా మోదీ షేర్ చేసిన ఒక ప్రత్యేక రీల్‌లో ఈ వైరల్ ట్రాక్‌ను ఉపయోగించారు. దీంతో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ రీల్స్‌తో దూసుకుపోతున్న ఈ సాంగ్ పాపులారిటీ ఒక్కసారిగా గ్లోబల్ లెవెల్‌కు చేరింది. ఈ అపూర్వమైన పరిణామంతో అల్లు అర్జున్ అభిమానులు సాషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పండగ చేసుకుంటున్నారు. జూన్ 16న, సోమవారం నాడు బ్రాటిస్లావాలో జరిగిన ఒక ఘనమైన అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీకి ఈ అరుదైన గౌరవం దక్కింది. స్లోవాకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని చేతుల మీదుగా మోదీ 'ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (ఫస్ట్ క్లాస్)' పురస్కారాన్ని అందుకున్నారు. ఇది 1993 లో స్లోవాకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని చేసిన మొదటి రాష్ట్ర సందర్శన కావడం విశేషం. ఈ నేపథ్యంలో తనకు దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవాన్ని మోదీ భారత 140 కోట్ల ప్రజలకు అంకితం చేశారు. ఈ చారిత్రాత్మకమైన వేడుకకు సంబంధించిన విజువల్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పవర్‌ఫుల్ రీల్‌ను షేర్ చేశారు. సాంప్రదాయిక కుర్తా ధరించిన మోదీ అవార్డు తీసుకుంటున్న ఫోటోలు మరియు వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన AA23 '23 థీమ్' మోగింది. ఏప్రిల్‌లో రిలీజ్ అయిన ఈ హై-ఎనర్జీ హార్న్స్ మరియు బీట్స్ ట్రాక్ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షలకు పైగా రీల్స్‌లో వాడబడి టాప్ చార్ట్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ షేర్ చేసిన ఈ లేటెస్ట్ పోస్ట్‌తో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా ఇంకా ఫ్లోర్స్ మీదకు