
తల్లయ్యాక కెరీర్‌ని కొనసాగించడం కష్టమనుకుంటారు కొందరు. అందులోనూ క్రీడల్లో ఇది సాధ్యమయ్యే పనే కాదనుకుంటారు మరికొందరు. అమ్మతనం తమ ఆటకు అడ్డుపడకుండా ప్రెగ్నెన్సీని వాయిదా వేసే క్రీడాకారిణులూ లేకపోలేదు. తల్లయ్యాక కెరీర్‌ని కొనసాగించడం కష్టమనుకుంటారు కొందరు. అందులోనూ క్రీడల్లో ఇది సాధ్యమయ్యే పనే కాదనుకుంటారు మరికొందరు. అమ్మతనం తమ ఆటకు అడ్డుపడకుండా ప్రెగ్నెన్సీని వాయిదా వేసే క్రీడాకారిణులూ లేకపోలేదు. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రసవానంతరం మహిళా క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ‘అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ)’ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. బిడ్డ పుట్టాక వారు సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏ మహిళా క్రికెటర్ కెరీర్‌కూ మాతృత్వం అడ్డుకాదని చెబుతూనే, క్రికెట్లో మహిళా సాధికారతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ఈ మార్గదర్శకాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సైతం ‘ఇది చరిత్రాత్మక ఘట్టం.. మహిళా క్రికెటర్లకు దక్కిన గొప్ప గుర్తింపు’ అంటూ ఐసీసీ నిర్ణయాన్ని ప్రశంసించింది. ఆటల్లో రాణించాలంటే శారీరక ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. అయితే ప్రసవానంతరం ఈ రెండింటినీ కోల్పోతారు మహిళలు. తిరిగి పుంజుకోవాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ వ్యవధిలో ఎన్నో అవకాశాలు చేజారిపోతాయి. దీంతో తమ కెరీర్ మధ్యలోనే ఆగిపోతుందన్న భయం చాలామంది క్రీడాకారిణుల్ని వెంటాడుతుంటుంది. ఈ భయాన్ని పోగొట్టి.. కొత్తగా తల్లైన మహిళా క్రికెటర్లను తిరిగి కెరీర్లో ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే తాజాగా కొన్ని మార్గదర్శకాల్ని తీసుకొచ్చింది ఐసీసీ. సాధారణంగా కొత్తగా తల్లైన క్రీడాకారిణులు తిరిగి ఆటలోకి అడుగుపెట్టాలంటే.. వాళ్లే వ్యక్తిగతంగా సంబంధిత నిపుణుల్ని నియమించుకొని ఆయా అంశాల్లో శిక్షణ పొందుతుంటారు. కానీ ఐసీసీ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ క్రికెట్ కమిటీనే స్వయంగా ఈ బాధ్యత తీసుకోనుంది. ప్రసవానంతరం మహిళా క్రికెటర్లను తిరిగి శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చేందుకు ఆరు ‘R’లతో కూడిన ఆరంచెల ఫ్రేమ్‌వర్క్‌ని సిద్ధం చేసింది