మూడు రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు ఎన్ టీఏ మెసేజ్
Actor ProfilePolitician

మూడు రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు ఎన్ టీఏ మెసేజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడు రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు ఎన్ టీఏ మెసేజ్
Eenadu18 Jun 2026
మూడు రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు ఎన్ టీఏ మెసేజ్

ఇంటర్నెట్‌ డెస్క్: నీట్‌-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (NTA) తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి.. పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రీటెస్టు ఉంటుందని.. పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను, సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా సందేశం విడుదల చేసింది. ఎన్‌టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపింది. మరోవైపు.. పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మే 3నాటి పరీక్షను రద్దు చేశాం. ఈ వ్యవహారం నుంచి పాఠాలు నేర్చుకుని పరీక్షా ప్రక్రియను మరింత బలోపేతం చేశాం. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పటిష్ఠమైన, బహుళ అంచెల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ‘మానస్’ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ నంబర్‌ను (14416) సంప్రదించి సాయం కోరవచ్చు’’ అని ఎన్‌టీఏ సూచించింది. టెలిగ్రామ్‌ కొత్త డార్క్‌ వెబ్‌.. నేరగాళ్లకు అడ్డా: కేంద్రం ‘‘పరీక్షకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమయ్యారు.. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉండండి. బాగా విశ్రాంతి తీసుకోండి. మీ నుంచి ఇదే కోరుకుంటున్నాం’’ అని అభ్యర్థులను ఉద్దేశించి ఎన్‌టీఏ పేర్కొంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడా.. విద్యార్థులను ప్రశాంతంగా ఉంచాలని, ధ్రువీకరించని సమాచారాన్ని వారితో షేర్‌ చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. వారు స్థిరమైన మనసుతో, నిశ్చింతగా పరీక్షకు వెళ్లేలా చూడాలని సూచించింది. పేపర్‌ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో మే 3నాటి నీట్-యూజీ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు