మీడియాకు దూరంగా ర ణ్ వీర్
Actor ProfileActor

మీడియాకు దూరంగా ర ణ్ వీర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీడియాకు దూరంగా ర ణ్ వీర్
Telugu Times21 Jun 2026
మీడియాకు దూరంగా ర ణ్ వీర్

రణవీర్ సింగ్(Ranveer Singh) గురించి బాలీవుడ్‌లో తాజాగా వినిపిస్తున్న ప్రచారం మరోసారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా తన ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం, మీడియాతో చురుకైన అనుబంధం వల్ల గుర్తింపు పొందిన రణవీర్, కొంతకాలం మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాబోయే 18 నెలల నుంచి రెండేళ్ల వరకు ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలు, పబ్లిక్ కామెంట్లకు దూరంగా ఉండే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు రణవీర్ లేదా ఆయన బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ డిస్క‌ష‌న్ కు ప్రధాన కారణంగా డాన్3(Don3) సినిమా చుట్టూ నెలకొన్న వివాదాన్ని ప్రస్తావిస్తున్నారు. షారుఖ్ ఖాన్(SHah rukh khan) స్థానంలో రణవీర్ సింగ్‌ను ఎంపిక చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించినప్పటికీ, రణవీర్ మాత్రం ఎలాంటి రియాక్ష‌న్ ఇవ్వలేదు. ఇటీవల ఆయనను కలిసిన ఓ ట్రేడ్ విశ్లేషకుడు కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు నటుడు ఆసక్తి చూపలేదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో రణవీర్ తన పనిపైనే పూర్తి దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ప్రస్తుతం రణవీర్ చేతిలో ఉన్న ప్రళయ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్ కే ఆయన మళ్లీ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు తక్కువ ప్రచారంతో, ఎక్కువగా తన సినిమాలపైనే దృష్టి పెట్టే వ్యూహాన్ని ఆయన అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, ఎప్పుడూ వార్తల్లో నిలిచే రణవీర్ సింగ్ కెరీర్‌లో ఇది గమనించదగ్గ మార్పుగా నిలవొచ్చు