మూడు నెలలు స్టార్ హీరోతో శ్రీదేవి కాపురం
Actor ProfileActor

మూడు నెలలు స్టార్ హీరోతో శ్రీదేవి కాపురం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడు నెలలు స్టార్ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
Asianet News Telugu14 Aug 2026
మూడు నెలలు స్టార్ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి

బాలీవుడ్‌లో ఒకప్పుడు ఎంతగానో చర్చించుకున్న సెలబ్రిటీ రిలేషన్స్ లో అతిలోక సుందరి శ్రీదేవి, ఒకప్పటి స్టార్‌ హీరో మిథున్ చక్రవర్తి మధ్య బంధం. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు, ఆఫ్-స్క్రీన్ రిలేషన్‌షిప్‌ గురించి కూడా అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. 80వ దశకంలో ఇద్దరూ తమ కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నారు. వాళ్ల బంధం గురించి దశాబ్దాలుగా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, తర్వాత విడిపోయారని ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. అయితే, మిథున్ గానీ, శ్రీదేవి గానీ తమ పెళ్లి విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఈ వార్తలకు మళ్లీ ప్రాణం పోశారు. షాకిచ్చే నిజాలను బయటపెట్టారు. మిథున్ చక్రవర్తి, శ్రీదేవి తమ సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యారో, వాళ్ల పర్సనల్ లైఫ్‌తోనూ అంతే వార్తల్లో నిలిచారు. ఇప్పుడు శ్రీదేవి మన మధ్య లేకపోయినా, వాళ్లిద్దరి బంధం గురించి మరోసారి చర్చ మొదలైంది. సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్‌ నేషనల్‌ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయం బయటపెట్టారు. వాళ్లిద్దరూ కొంతకాలం పాటు భార్యాభర్తల్లా కలిసి జీవించారని ఆయన అన్నారు. `నిజానికి వాళ్లు దాదాపు మూడు నెలల పాటు పెళ్లైన జంటలా కలిసి ఉన్నారు` అని జ్యోతి వెంకటేష్ స్పష్టం చేశారు. ఒక అవుట్‌డోర్ షూటింగ్ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఆ సమయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. `మిథున్‌కు ఒక అవుట్‌డోర్ షూట్ ఉండేది, నేను కూడా వెళ్లాను. శ్రీదేవి ఎప్పుడూ సెట్‌కు వచ్చేది కాదు. ఆమె తన గదిలోనే ఉండేది. కానీ, వాళ్లిద్దరూ కలిసే ఉన్నారని అందరికీ తెలుసు` అని ఆయన గుర్తుచేసుకున్నారు. మిథున్-శ్రీదేవికి సంబంధించిన ఓ సరదా సంఘటన ఆ సమయంలో మిథున్ చక్రవర్తితో జరిగిన ఒక ఫన్నీ సంభాషణను కూడా జ్యోతి వెంకటేష్ పంచుకున్నారు. `మిథున్ నాకు చాలా మంచి స్నేహితుడు. నేను ఆయనతో సరదాగా ఓ మాట అన్నాను. 'మిథున్ సర్