
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. అయితే ఇప్పటివరకూ అనుకుంటున్న దానికి భిన్నంగా ఈ నెలాఖరుకు బదులు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఇది జరిగే అవకాశం ఉంది. మరోవైపు అదే సమయంలో అధికార పార్టీ బీజేపీలోనూ కీలక మార్పులు జరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీలోనూ ఒకేసారి మార్పులు ఉండబోతున్నాయి. దీంతో ఈసారి కేబినెట్ ప్రక్షాళన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలపై ప్రభావం చూపబోతోంది.జూలై మూడవ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి కాస్త ముందు కేబినెట్ మార్పులు ఉంటాయని సమాచారం. అలాగే నితిన్ నబిన్ నేతృత్వంలో బీజేపీ కొత్త సంస్థాగత బృందాన్ని ప్రకటించడంతో పాటు ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం ఈ జాబితాను ఇప్పటికే ఖరారు చేసింది. ఇందులో బీజేపీలో పలువురు యువ నేతలకు కీలక పదవులు అప్పగించబోతున్నారు. కేంద్రమంత్రి రాజీనామా..! మోడీ కేబినెట్ విస్తరణ వేళ..!కొందరు కేంద్ర మంత్రులను బీజేపీలోని సంస్థాగత పదవుల్లోకి బదిలీ చేయడానికి, పార్టీ కార్యనిర్వాహకులను మోదీ ప్రభుత్వంలోకి తీసుకోవడానికి బలమైన అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించడం, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ అప్పగించి, ఆమె శాఖకు మంత్రిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ను తీసుకురావడం, అనురాగ్ ఠాకూర్ ను తిరిగి కేబినెట్లోకి తీసుకోవడం వంటి మార్పులు చేయబోతున్నారు.పవన్ పై ఒత్తిడి పెంచేస్తున్న వైసీపీ..! రంగంలోకి చంద్రబాబు కేబినెట్ ..!ప్రధానమంత్రి మోదీ జూన్ 27 నుండి 29 వరకు సీషెల్స్‌లో మూడు రోజుల పర్యటనలో ఉండబోతున్నారు. జూలై 6 నుండి 11 మధ్య ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్తారు. జపాన్ నేత సనాయే తకైచి జూలై 1 నుండి 3 వరకు న్యూఢిల్లీని సందర్శిస్తారు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఖరారు చేస్తారు. పరీక్షల లీకేజీలు, ఆర్దిక సంక్షోభం