మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే
Actor ProfileCelebrity

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే
TV9 Telugu12 Aug 2026
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రతిరోజూ సాయంత్రం మెట్రో ఎక్కాలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షం పడినా, రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయినా మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని తట్టుకోవడానికి సాధ్యమైనంత త్వరగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో కోసం కొత్త కోచ్‌ల రాక మరింత ఆలస్యం కానున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. సాంకేతిక, ఆర్థిక కారణాల వల్ల మరో రెండేళ్ల వరకు కొత్త కోచ్‌లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్ట్‌ను పూర్తిగా ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోగానే, రద్దీని తట్టుకోవడానికి వీలుగా 60 కొత్త కోచ్‌ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ సంస్థతో ప్రాథమిక సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం మెట్రోరైలు ప్రాజెక్ట్‌ మొత్తం విలువను రీ వాల్యుయేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ స్వాధీన ప్రక్రియలో పెద్ద ప్రతిష్టంభన నెలకొంది. ఈ విలువ నిర్ధారణ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం ఎస్‌బీఐ క్యాప్స్‌‌ను రంగంలోకి దించింది. అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి కింది దశలు దాటాల్సి ఉంటుంది. విలువ నిర్ధారణ: ఎస్‌బీఐ క్యాప్స్‌ మెట్రో విలువను లెక్కించడానికి కనీసం మరో 2 నెలల సమయం పడుతుంది. తక్కువ వడ్డీకి రుణం: మెట్రోకు ప్రస్తుతం ఉన్న భారీ అప్పులను ప్రభుత్వంపైకి బదిలీ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను ఎస్‌బీఐ క్యాప్స్‌ ఎంపిక చేయాలి. ఆర్డర్ ఆలస్యం: ఈ లోన్ మంజూరు ప్రక్రియ ముగిసి, స్వాధీన ప్రక్రియ పూర్తి కావడానికే ఈ ఏడాది అయిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చేతికి ప్రాజెక్ట్ వచ్చేంతవరకు కొత్త కోచ్‌లకు ఆర్డర్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ