
అమెరికాలో ఘనంగా జరిగిన ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన’ (మాటా) రెండవ మహాసభలలో కమ్యూనిటీ ప్రముఖులు, సేవా కార్యక్రమాల్లో ముందుండే దాము గేదెలను ‘మాటా ఎక్సలెన్స్ అవార్డు’ తో ఘనంగా సత్కరించారు. సమాజ సేవ విభాగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. మహాసభల వేదికపై దాము గేదెల గారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ వేదికపై అýనాటి సినీనటి జయప్రద, సినీనటి ఐశ్వర్యరాజేశ్, ప్రదీప్, మాటా నాయకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీధర్ గుడాల ఉన్నారు. ఈ సందర్భంగా దాము గెదెల చేసిన సామాజిక, సాంస్కృతిక రంగాలలో చేసిన సేవలను కొనియాడారు. జన్మభూమి ప్రగతికోసం ఆయన తనవంతుగా ఎన్నో సేవలను అందించారు. ఆయన సేవలకు గాను ఎన్నో పురస్కారాలను కూడా పొందారు. గతంలో ఐదు ప్రతిష్టాత్మక జీవితకాల సాఫల్య పురస్కారాలు, ‘గాన గంధర్వ’ అవార్డు, 25కు పైగా కమ్యూనిటీ అవార్డులు, డాక్టర్ అక్కినేని పురస్కారం మరియు ప్రతిష్టాత్మకమైన ‘ఎడిసన్ మేయర్ ప్రెసిడెన్షియల్ అవార్డు’లను ఆయన అందుకున్నారు. తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణతో పాటు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తూ, తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన దాము గేదెల గారిని ‘మాటా’ వేదికపై సత్కరించడం పట్ల పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు, తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. Click here for Photogallery