
'మంజుమ్మల్ బాయ్స్' మూవీ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన తాజా చిత్రం 'బాలన్: ది బోయ్'కు చక్కని స్పందన లభిస్తోంది. త్వరలో తాను తెలుగులోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు చిదంబరం తెలిపారు. గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ 'బాలన్: ది బాయ్'. ఈ చిత్రానికి 'ఆవేశం' దర్శకుడు జితూ మాధవన్ స్క్రిప్ట్ అందించారు. 'మంజుమ్మెల్ బాయ్స్' దర్శకుడు చిదంబరం దీనిని తెరకెక్కించారు. శుక్రవారం ఈ సినిమా ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ శైలజా దేశాయి ఫెన్ మాట్లాడుతూ, -'తేస్పియన్ ఫిలింస్‌లో మొదటి చిత్రమిది. నిర్మాతలుగా మాకు తొలి ప్రయత్నమైనా మమ్మల్ని డైరెక్టర్ చిదంబరం నమ్మారు. చిదంబరంతో పాటు డైరెక్టర్ ప్రియదర్శన్ వల్లే మా తెస్పియన్ ఫిలింస్ సంస్థ ఏర్పాటైంది. ఈ చిత్రంతో పాటు మేం హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 'హైవాన్' అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడ్యూసర్ వెంకట్ మాకు పూర్తి సహకారం అందించారు. మమ్మల్ని మా ప్యాషన్‌ను నమ్మి వెన్నంటి నిలబడ్డారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను' అని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ ముహమ్మద్ జినాన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా సినిమాపై ఇలాగే మీ ఆదరణ కొనసాగుతుందని నమ్ముతున్నాం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఒక యూనిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నాను' అని అన్నారు. మరో చైల్డ్ ఆర్టిస్ట్ ఆది శేషన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్ చిదంబరం గారికి థ్యాంక్స్. మా చిత్రాన్ని చూసిన